లోకసభ ఎన్నికలు 2019: అరకు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

ఏపిలో 2009 లో ఎస్టీ నియోజకవర్గం గా రూపాంతరం చెందింది అరకు. విజయనగరం-తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కలిపి అరకు ఎస్టీ నియోజకవర్గం గా ఏర్పడింది. పూర్వం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం 1957 లో ప్రారంభమై ప్రధానంగా శత్రుచర్ల-వైరిచర్ల గిరిజన రాజ వంశీకుల మధ్య ప్రధానంగా పోటీ ఉండేది. ఇక, సీనియర్ రాజకీ య నేతలను సైతం ఇక్కడ ఓడించిన చరిత్ర గిరిజన నేతలది. 2009 లో అరకు నియోజకవర్గం గా మారిన తరువాత ఇప్ప టి వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఒకసారి కాంగ్రెస్..2014 లో వైసిపి అభ్యర్ధి గెలుపొందారు.
1957- 2004 అరకు గా 2009 నుండి..
పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం 1957 లో ఏర్పాటైంది. ఆ తరువాత 2009 లో అరకు నియోజకవర్గం గా మారిన తరువాత ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏడుగురు గిరిజన నేతలు 14 సార్లు గెలుపొందారు. టిడిపి ఇక్కడి నుండి రెండు సార్లు గెలవగా..స్వతంత్ర పార్టీ అభ్యర్ధి ఒక సారి, కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించింది. అందులో ప్రధానం గా ఇక్కడ పోటీలో కిషోర్ చంద్రదేవ్ నాలుగు సార్లు, శత్రుచర్ల విజయరామరాజు మూడు సార్లు గెలుపొందారు. చరణ్ సింగ్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కిషోర్ చంద్రదేవ్ మంత్రిగా పని చేసారు.
ఎస్టీ జనాభా ఎక్కువ..
అరకు లోక్‌సభ నియోజకవర్గంలో 2014 ఎన్నికల లెక్కల ప్రకారం 19 లక్షల 26 వేల 513 మంది గా రికార్డు అయింది. గ్రామీణ ప్రాంత జనాభా 91.59 శాతం కాగా, పట్టణ ప్రాంత జనాభా 8.4 శాతంగా ఉంది. ఇందులో ఎస్సీ జనాభా 7.23 శాతం గా నమోదైంది. ఇక, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉన్న అరకు లోక్‌సభ పరిధిలో ఎస్టీ జనాభా 54.76 శాతం గా ఉంది. ఇక, ఇదే పార్లమెంట్ పరిధిలో ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రభావం చూపిస్తున్నాయి.

12 లక్షలకు పైగా ఓటర్లు..
అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 12 లక్షల 72 వేల 724 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 622,416 మంది పురుష ఓటర్లు కాగా, 650, 308 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక, 2014 ఎన్నికల్లో 909, 614 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో మహిళా ఓటర్లు 458,264 మంది ఉండగా, పురుష ఓటర్ల సంఖ్య 451,350 గా ఉంది. మొత్తంగా 2014 ఎన్నికల్లో పోలింగ్ 71 శాతంగా నమోదైంది.
2014 లో వైసిపి అభ్యర్ది గెలుపు..ఫిరాయింపు
2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా కొత్తపల్లి గీత విజయం సాధించారు. సీనియర్ నేత కాంగ్రెస్ నుండి పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్ ఓడిపోయారు. ఇక, ఉత్తరాంధ్ర నుండి వైసిపి గెలిచిన ఏకైక సీటు అరకు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి కి 4 లక్షల 13 వేల 191 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ధికి 3 లక్షల 21 వేల 793 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి 91,398 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఇక, ఈ లోక్‌సభ పరిధిలోని పార్వతీపురం మినహా..మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపికి మెజార్టీ దక్కింది. ఎన్నికల తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైసిపి నుండి గెలిచని కొత్తపల్లి గీత తొలుత టిడిపి కీ..ఆ తరువాత ఆ పార్టీకి సైతం దూరంగా ఉంటూ..తాజాగా కొత్త పార్టీ స్థాపించారు.
ఎంపీగా గీత రికార్డు ఎలా ఉందంటే..
తొలి సారి ఎంపీగా లోక్‌సభ లో కాలు పెట్టిన కొత్తపల్లి గీత సమావేశాల్లో డిసెంబర్ చివరి వరకూ 93 చర్చల్లో పాల్గొన్నట్లు గా రికార్డులు చెబుతున్నాయి. సభలో 599 ప్రశ్నలను సంధించారు. కాగా, సమావేశాలకు హాజరు 97 శాతంగా నమోదైం ది. కొత్తపల్లి గీత వైసిపి ఎంపీగా గెలిచినా..ఆ తరువాత టిడిపి, ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తగా ఉంటున్నారు.
2019 ఎన్నికలకు సమాయత్తం..
అరకు లోక్‌సభ నుండి వైసిపి నుండి స్థానికంగా ఓ అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త ను నిలబెట్టాలని వైసిపి అధినేత జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక, టిడిపి నుండి గతంలో గుమ్మడి సంధ్యారాణి పోటీ చేయగా..ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో..ఓ ఐఏయస్ అధికారి పేరును టిడిపి పరిశీలిస్తోంది. జనసేన సైతం ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయటానికి సిద్దంగా ఉంది. దీంతో..ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications