లోకసభ ఎన్నికలు 2019 : కాకినాడ నియోజకవర్గం గురించి తెలుసుకోండి

తూర్పు గోదావరి జిల్లాలో తొలి నుండి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం ది ప్రత్యేక స్ధానం. ఒక్కడి మొదటి నుండి ఒక ప్రధా న సామాజిక వర్గ నేతలే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు ఆయన తండ్రి సంజీవ రావు లు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన వారే. సినీ నటుడు కృష్ణంరాజు ఇక్కడి నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వ హించారు. లోక్‌సభ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం ఒక ప్రధాన సామాజిక వర్గ నేతలు ఎక్కువగా గెలు స్తూ వచ్చారు. ఇక, 2014 ఎన్నికల తరువాత ఈ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. తాజా గా జనసేన ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పట్టు కోసం ప్రయత్నిస్తుండటం..సామాజిక వర్గాల అండ ప్రధానంగా ఉం డటంతో..ఈ సారి ఈ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
17 సార్లు ఎన్నికలు.. 15 లక్షల ఓటర్లు..
కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిపిఐ ఒకసారి, కాంగ్రెస్ 10 సార్లు, టిడిపి 5 సార్లు, బిజెపి ఒక సారి గెలుపొందాయి. అందులో ఏడుగురు కాపు నేతలు 15 సార్లు లోక్‌సభకు గెలుపొందారు. కాగా , ఒక సారి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు గెలిచారు. ఇక, ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 14లక్షల 18 వేల 290 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 709101 రాగా. మహిళా ఓటర్లు సంఖ్య 709189 గా ఉన్నారు.

2014 లో 78 శాతం పోలింగ్..టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ పరిధిలో మొత్తంగా 1099999 ఓట్లు పోలయ్యాయి. అందులో మహిళ ఓటర్లు 541310 కాగా, పురుష ఓటర్లు 558689 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 78 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన మాజీ మంత్రి తోట నరసింహం కు 514402 ఓట్లు రాగా, వైసిసి నుండి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కు 510971 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి నరసింహం 3431 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.
ఎంపీగా తోట నరసింహం ..
నియోజకవర్గంలో సుపరిచితుగా ఉన్న తోట నరసింహం లోక్‌సభ లో టిడిపి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. లోక్‌సభ సభ్యుడి గా సభలో జరిగిన 66 చర్చల్లో పాల్గొన్నారు. సభ్యుడిగా సభలో డిసెంబర్ చివరి వరకు సభ రికార్డుల మేరకు 129 ప్రశ్న లను సంధించారు. సభకు హాజరు 95 శాతంగా ఉంది. ఇక, టిడిపి ఫ్లోర్ లీడర్ గా అనేక కేంద్రం పై ఏపి ప్రభుత్వ పోరాటంలో కీలక భూమిక పోషించారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరెటువైపు..
వచ్చే ఎన్నికల కోసం ఇక్కడి పోటీ చేయటానికి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. టిడిపి సిట్టింగ్ ఎంపీగా ఉన్న తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ కు పోటీ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అనారోగ్య కార ణాల వలన ఆయన పోటీకి దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇక, గత ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన సునీల్ టిడిపి తో సఖ్యతగా ఉంటున్నారనే వాదన ఉంది. ఆయన టిడిపి లేదా జనసేన నుండి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక, ఇక్కడ ఈ సారి జనసేన కీలకంగా మారనుంది. జనసేన ఈ నియోజకవర్గ పరిధిలో తన బలం చాటుకోవటానికి ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష వైసిపి నుండి ఎవరు బరిలోకి దిగుతారనేది ఇంకా స్పష్టత లేదు. అభ్యర్ధి విషయం పై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. దీంతో.. కాకినాడ లోక్‌సభ ఎన్నిక ఈ సారి రాజకీయంగా ఆసక్తిని పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.