లోకసభ ఎన్నికలు 2019 : నర్సాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

సైలెంట్ రాజకీయాలు..క్షత్రియ వర్గానికి పెట్టని కోట నర్సాపురం నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ నియో జకవర్గం పూర్తగా రాజుల అధిపత్యంలోనే ఉంటుంది. ఎందరో కీలక నేతలు ఇక్కడి నుండే లోక్‌సభ కు ఎన్నికయ్యారు. భూపతి రాజు విజయకుమార్ రాజు, బిజెపి ప్రముఖుడు కృష్ణం రాజు, టిటిడి మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు వంటి వారు ఇక్కడి నుండే లోక్‌సభ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుండి 1991 లో టిడిపి నుండి గెలిచిన భూపతి రాజు విజయ కుమార్ రాజు నాడు పివి నరసింహారావుకు మద్దతుగా పార్టీ చీలికకు నాయకత్వం వహించారు. మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు..2014 లో బిజెపి నుండి గెలిచిన గోకరాజు గంగరాజు ఇద్దరూ బావ -బావమరుదులు. ఈ నియోకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోకవర్గాల్లో 2014 లో ఒక్క నియోజకవర్గం మినహా అన్ని సెగ్మెంట్లలో ఒకే తీరున పోలింగ్ కనిపిస్తుంది.
17 సార్లు ఎన్నికలు..
నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం 1957 లో ఏర్పాటైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ 17 సార్లు లోక్‌సభ కు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎనిమిది సార్లు గెలవగా.. టిడిపి నాలుగు సార్లు గెలిచింది. బిజెపి రెండు సార్లు ఇక్కడి నుండి గెలుపొందింది. ఎనిమిది మంది క్షత్రిక సామాజిక వర్గ నేతలు 15 సార్లు ఇదే లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరు కాపు నేతలు రెండు సార్లు గెలిచారు. కాగా, ఇక్కడి నుండి గెలిచిన వారిలో కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పని చేసారు. ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉన్నా..క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
2014 లో బిజెపి గెలుపు.. 82 శాతం పోలింగ్..
2014 ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తంగా 1325143 ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 652668 మంది ఉన్నారు. కాగా, మహిళా ఓటర్లు 672475 మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం ఇక్కడ 1088951 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. అందులో పురుష ఓటర్లు 539357 మంది, 549594 మంది మహిళా ఓటర్లు ఓటు హక్కు విని యోగించుకున్న వారిలో ఉన్నారు. కాగా..మొత్తంగా 82 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ నుండి 2014 లో టిడిపి -బిజెపి పొత్తులో భాగంగా..బిజెపి నుండి గోకరాజు గంగారాజు పోటీ చేసారు. ఆయన వైసిపి అభ్యర్ధి వంకా రవీంద్ర నాద్ పై గెలుపొందారు. గోకరాజు గంగరాజుకు 540306 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్ధి రవీంద్ర నాధ్ కు 454955 ఓట్లు వచ్చాయి. దీంతో.. 85351 ఓట్ల మెజార్టీతో గోకరాజు గంగరాజు గెలుపొందారు.

అధికార పార్టీ ఎంపీగా..
వివాద రహితుడిగా పేరున్న గోకరాజు గంగరాజు బిజెపి పెద్దల తో సన్నిహిత సంబంధాలు ఉన్న నేత. ఆయన లోక్‌సభ కు ఎన్నికైన తరువాత అధికార పార్టీ సభ్యుడిగా ఏపిలో పార్టీ వాయిస్ వినిపించటానికి ప్రాధాన్యత ఇచ్చారు. లోక్‌సభ లో సభ్యుడిగా ఆయన కేవలం రెండు చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు. ఒక్క బిల్లును కూడా ఆయన ప్రతిపాదించే అవకా శం రాలేదు. సభలో మాత్రం 224 ప్రశ్నలను సంధించారు. సభకు హాజరు 82 శాతంగా నమోదైంది. విశాఖ, నరసాపురం రెండు లోక్‌సభ స్థానాల నుండి బిజెపి 2014 లో గెలిచింది. దీంతో..ఈ ఇద్దరు సభ్యులకు మారుతున్న రాజకీయ పరిణా మాల్లో బాధ్యతలు పెరిగాయి.
తిరిగి పోటీలో వారేనా..
2014 లో టిడిపి - బిజెపి పొత్తు కారణంగా గోకరాజు గంగరాజు కు టిడిపి తో పాటుగా పవన్ కళ్యాన్ మద్దతు లభించింది. మోదీ హవా కూడా కలిసి రావటంతో గంగరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీగా తిరిగి బిజెపి నుండి గోక రాజు గంగరాజు తిరిగి పోటే చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో టిడిపి నుండి రఘురామ రాజు టిక్కెట్ ను ఆశి స్తున్నారు. ఇక, వైసిపి నుండి గతంలో పోటీ చేసిన వ్యక్తికే తిరిగి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన ఈ సారి ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించనుంది. దీంతో..ఈ సారి ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ తప్పేలా లేదు. అభ్యర్ధులెవరనేది ఖరారైతే..పోటీ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..!












Click it and Unblock the Notifications