హైదరాబాద్ అబ్బాయి..లండన్ అమ్మాయి పెళ్లి(ఫొటో)

హైదరాబాద్: నగరంలోని మూసారాంబాగ్‌కు చెందిన అబ్బాయి.. ఇంగ్లండ్ దేశంలోని లండన్‌కు చెందిన అమ్మాయి ఒక్కటయ్యారు. వేద పండితుల మంత్రాలతో, పెద్దల దీవెనలతో కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్ వేదికగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది.

హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌కు చెందిన కొట్నాల విజయ్ కుమార్, విద్యారాణిల కుమారుడు సాయిక్రాంతి కుమార్ 2007లో ఎంఎస్ చదివేందుకు ఇంగ్లండ్ లండన్ వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసిన క్రాంతి కుమార్ అక్కడే ఓ బ్యాంకులో మేనేజర్‌గా స్థిరపడ్డారు.

London bride, Indian bridegroom marriage at Hyderabad

లండన్‌లోనే ఒక వైపు చదువుకుంటూ, మరోవైపు ఓ టెలివిజన్ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న క్లోయిశీతల్‌తో క్రాంతి కుమార్‌కు పరిచయమైంది. ఈమె జిల్ థార్న్‌టన్, స్టీవ్ థార్న్‌టన్ దంపతుల కూతురు. క్రమంగా క్లోయిశీతల్, క్రాంతి కుమార్‌ల పరిచయం పెరిగి ప్రేమగా మారింది.

అలా దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్న వీరు చివరకు తమ అనురాగం సంగతిని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వారు అంగీకారం అంగీకారం తెలపడంతో భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+