తెలంగాణ భక్తులకు శ్రీవారి దర్శనాలు ప్రారంభం-తొలిరోజు ఎంతమందో తెలుసా ?
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని తెలంగాణ నుంచి వచ్చే భక్తులు సిఫార్సు లేఖలపై దర్శించుకునే విషయంలో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో ముందుగా చెప్పినట్లే టీటీడీ ఇవాళ్టి నుంచి తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలతో వస్తున్న భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. తిరుమలకు తెలంగాణ భక్తులు వెళ్లే విషయంలో అక్కడి సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో వీరి దర్శనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మొదటిరోజు శ్రీవారిని భక్తులు దర్శనం చేసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇవాళ ఓ ట్వీట్ చేశారు. తొలిరోజు 550 నుండి 600 మంది వరకు తెలంగాణా లెటర్స్ పై విఐపీ బ్రేక్ దర్శనాలను కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి ఉన్నతాధికారులకు భక్తులు ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. మంచి దర్శనం, వసతి కల్పిస్తున్న టీటీడీ అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మొదటిరోజు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులు
— B R Naidu (@BollineniRNaidu) March 24, 2025
తొలిరోజు 550 నుండి 600 మంది వరకు తెలంగాణా లెటర్స్ పై విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించిన టీటీడీ
శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు గారికి మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి… pic.twitter.com/pVIh3e7dXE
వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనానికి భక్తుల్ని టీటీడీ అనుమతించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని నిలిపేసింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత దీన్ని పునరుద్దరించింది. ఇప్పుడు వారానికి రెండు రోజుల్లో ఇలా సిఫార్సు లేఖలపై దర్శనాలకు టీటీడీ అనుమతిస్తోంది. ఆదివారం, సోమవారం సిఫార్సు లేఖలను తీసుకుని, సోమ, మంగళవారాలు భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనుంది. అది కూడా ఒక ప్రజా ప్రతినిధి ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతించనుంది. ఒక లేఖపై ఆరుగురికి మించకుండా శ్రీవారి దర్శనం కల్పించనుంది.












Click it and Unblock the Notifications