షాక్: జల్సాల కోసం వ్యభిచారం చేయాలని భర్త వేధింపులు, హత్యాయత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: తన జల్సాల కోసం కట్టుకొన్న భర్తే తనను వ్యభిచారం చేయాలని వేదింపులకు గురిచేస్తున్నాడని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పినట్టుగా వినకపోతే తన పిల్లలను వ్యభిచార గృహలకు అమ్మేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.న్యాయం చేయాలంటూ బాధితురాలు మహిళ సంఘాన్ని ఆశ్రయించింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది.

అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే తన భార్యను వ్యభిచారం చేయాలని వత్తిడి చేస్తున్నాడు. తాను పనిచేసే యజమానితోనే వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చాడని బాధితురాలు చెబుతోంది.

చేసే పనిని మానేసి జల్సాలకు అలవాటు పడి వ్యభిచారం చేయాలని తనను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.తనను కాపాడాలని బాధితురాలు కోరుతోంది.

జల్సాల కోసం వ్యభిచారం చేయాలని ఒత్తిడి

జల్సాల కోసం వ్యభిచారం చేయాలని ఒత్తిడి

జల్సాల కోసం తన భర్త తనను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని విజయనగరం జిల్లాకు చెందిన వివాహిత చెబుతోంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానికంగా ఉన్న మహిళా సంఘం నేతలను బాధితురాలు ఆశ్రయించింది. విశాఖపట్టణానికి చెందిన తనకు 17 ఏళ్ళ క్రితం విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన వ్యక్తితో వివాహమైనట్టు బాధితురాలు చెప్పింది. అయితే రెండేళ్ళపాటు బాగానే కాపురం చేసినట్టు బాధితురాలు చెప్పారు. లారీ డ్రైవర్‌గా పనిచేసే తన భర్త పనిమానేసి జల్సాలకు అలవాటుపడ్డాడని బాధితురాలు చెప్పారు.పని మానేసి జల్సాలు చేయడం ప్రారంభించాడని ఆమె చెప్పారు. అంతేకాదు తనను వ్యభిచారం చేయాలని ఒత్తిడికి గురిచేశాడని ఆమె చెప్పారు.

కుటుంబం కోసం లారీ యజమానితో సంబంధం

కుటుంబం కోసం లారీ యజమానితో సంబంధం

కుటుంబం గడవడం కోసం తాను పనిచేసే లారీ యజమానితో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేశాడని బాధితురాలు చెప్పారు. అయితే కుటుంబ అవసరాల కోసం తాను లారీ యజమానితో వివాహేతర సంబంధానికి ఒప్పుకొన్నట్టుగా ఆమె చెప్పారు. అయితే దీన్ని సాకుగా చూపి వ్యభిచారం నిర్వహించాలని ఒత్తిడికి గురిచేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యభిచారం చేయకపోతే చంపుతానంటున్నాడు

వ్యభిచారం చేయకపోతే చంపుతానంటున్నాడు

తాను జల్సాలు చేయడం కోసం వ్యభిచారం చేయాలని తనపై భర్త తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు చెప్పారు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తానని బెదిరించడమే కాకుండా పలు మార్లు హత్యాయత్నానికి ప్రయత్నించాడని బాధితురాలు చెప్పారు.ఈ బాధలు తట్టుకోలేక రెండు దఫాలు ఆత్మహత్యాయత్నానికి కూడ ప్రయత్నించినట్టు బాధితురాలు తెలిపారు.

వ్యభిచార గృహలకు పిల్లల్ని విక్రయిస్తామని బెదిరింపు

వ్యభిచార గృహలకు పిల్లల్ని విక్రయిస్తామని బెదిరింపు

తాను చెప్పినట్టుగా వినకపోతే తనను చంపేస్తానని తన భర్త బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయారు. మరోవైపు తన ఇద్దరు పిల్లల్ని కూడ వ్యభిచార గృహలకు విక్రయిస్తానని వేధిస్తున్నాడని బాధితురాలు చెప్పారు. ఈ కారణంగానే తాను పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నట్టు ఆమె చెప్పింది. అయితే అక్కడికి కూడ వచ్చి తనను వేధిస్తున్నట్టు బాధితురాలు చెప్పారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. మరో వైపు ఇదే విషయమై స్థానికంగా ఉన్న మహిళా సంఘం నేతలను బాధితురాలు ఆశ్రయించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Lady allegedlty that her husband forcing to prostitution in Vijayanagaram district. She spoke to media on Saturday.he forced her into prostitution to pay for their daily expenses.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి