ఘోరం.. జేన్‌టియూ వీసీ కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
కారును లారీ ఢీ కొన్న ఘటనలో అనంతపురం వీసీ సహా మరో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురం: పామిడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో అనంతపురం జేన్టీయూ వీసీ సర్కార్, ఆయన పీఏ ఫక్రుద్దీన్, కారు డ్రైవర్ ఉన్నారు.
యాక్సిడెంట్ వార్త తెలియగానే జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదానికి స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. కారును లారీ ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో కారును లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వీసీ సర్కార్ అనంతపురం నుంచి కర్నూలు వెళ్తున్నట్లుగా సమాచారం.













Click it and Unblock the Notifications