వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోటస్ పాండ్ కేరాఫ్ అడ్రస్: ఉమ, ఓటేస్తే: యనమల

By Pratap
|
Google Oneindia TeluguNews

Uma - Yanamala
విజయవాడ: హంతకులు, కబ్జాదారులు, బ్రోకర్లు, ఆర్థిక నేరగాళ్లకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్‌కు చెందిన లోటస్‌పాండ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేయడానికి కోనేరు ప్రసాదరావు లాంటి ఆర్థిక నేరగాళ్లను పార్లమెంట్‌కు పంపేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

అలాంటి వ్యక్తులకు సీట్లు ఇస్తే సీమాంధ్ర పరిస్థితి ఏమిటని ఉమా ప్రశ్నించారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో జగన్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ పార్టీలో ఉన్నవాళ్లు ఆర్థిక ఉగ్రవాదులని, ఈ దేశ పార్లమెంట్‌పై దాడి చేయడానికి వస్తున్నారని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమవడానికి దారి తీస్తుందని ఆయన అన్నారు.

జగన్మోహన్‌రెడ్డికి జనం ఓటేస్తే సీమాంధ్రను సింగపూర్‌కు అమ్మేస్తారని, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఓటేస్తే సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తారని తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఆర్థ్ధిక నేరాల్లో ఆరితేరిన వ్యక్తిని రాష్ట్రాధినేతగా ఎన్నుకుంటే జనం నెత్తిపై శఠగోపం పెట్టి రాష్ట్రాన్ని దోచుకుతింటాడని దుయ్యబట్టారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశంపార్టీ ఇంచార్జి జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో యనమల రామకృష్ణుడు మంగళవారంనాడు ప్రసంగించారు. సమైక్యాంధ్ర ముసుగులో రాష్ట్రాన్ని ముక్కలుగా చేసేందుకు దోహదపడిన విభజన వాదులు, వేర్పాటువాదులు మరోమారు ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని అంటూ, వీరిని ప్రజలు తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించిన బ్లూప్రింట్‌ను చంద్రబాబు సిద్ధం చేసి ఉంచారని, పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తారని ఆయన చెప్పారు. లక్షకోట్లు కాజేసి ఏడాదిన్నర జైలు జీవితం అనుభవించి, పది చార్జిషీట్లు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగిస్తే సీమాంధ్రను అమ్మి సొమ్ము చేసుకుంటాడని అన్నారు. సీమాంద్ర అభివృద్ధి తెలుగుదేశం లక్ష్యం కాగా ప్రజాధనం లూటీ వైయస్సార్ కాంగ్రెసు లక్ష్యమని ఈ విషయం ప్రజలు అర్ధం చేసుకున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు అధికారం చేపట్టగానే మొదటి సంతకం సిఎంగాను, రెండో సంతకం డ్వాక్రా రుణాల రద్దుపైనా పెడతారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని గెలిపించుకుని సీమాంధ్రను అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

English summary
Telugudesam MLA Devineni Umamaheswar Rao accused YSR Congress party president YS jagan's lotus pond became the care of address for the group of illegal activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X