బ్రాహ్మణితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్: బాలయ్యకు భయపడిన నారా లోకేష్ ప్రేమ కహానీ

గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో ప్రేమ వ్యవహారం గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఆయన తెలిపారు. మంగళగిరిలో విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతి.. బ్రాహ్మణితో ప్రేమ విషయంపై ఆయనను ప్రశ్నించారు.

బ్రాహ్మణితో పెళ్లి ప్రతిపాదన మొదటగా ఎవరు తీసుకుని వచ్చారని నారా లోకేష్‌ను ఆ యువతి ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా ప్రాంగణమంతా కేకలు వేస్తూ కేరింతలు వేశారు యువతీయువకులు. లోకేష్ చుట్టూ సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయంటూ పక్కనే ఉన్న ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు.

ఇక ఈ విషయంపై నారా లోకేష్ స్పందిస్తూ.. 'చెప్పమంటారా..
నాది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా' అని చెప్పారు. దీంతో అక్కడున్నవారంత వావ్ అంటూ కేకలు వేశారు. కానీ, ముద్దుల మామయ్య (నందమూరి బాలకృస్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడని కాదులే అని లోకేష్ చెప్పుకొచ్చారు.

 Love at first sight with Brahmani: Nara Lokesh on his love story

'ఇంట్లో అమ్మా నాన్న వెకేషన్‌కు వెళితే వాళ్లప్పుడు చెప్పారు. ఇట్లనుకుంటున్నాం.. నీ అభిప్రాయమేంటని.. ఇక నా అభిప్రాయం మీకు తెలుసు కదా.. సో వాళ్లు ముందల ప్రతిపాదించారు.. ఎస్ అన్నాను. బ్రాహ్మిణి కూడా ఒప్పుకుంది. అలా జరిగింపోయింది.. థాంక్యూ' అని నవ్వుతు నారా లోకేష్ తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చారు.

ఇది ఇలావుండగా, యువత సమస్యలను పరిష్కరించేందుకే యువగళం పాదయాత్ర చేపట్టానని నారా లోకేశ్ అన్నారు. విద్యార్థులు, యువత అడిగిన ప్రశ్నలను సమాధానం చెప్పారు. దేశమంతా గొప్పగా చెప్పుకునే ఏపీ.. ఇప్పుడందరికీ చులకనైందన్నారు. ఎలాంటి భవిష్యత్తు కావాలో యువత నిర్ణయించుకోవాలని లోకేశ్ సూచించారు.

నారా చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వం ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తుందని మండిపడ్డారు. 3 రాజధానులు కావాలా?.. అమరావతి రాజధాని కావాలా?.. చిన్న జీతంతో సరిపెట్టుకుంటారా?.. రూ.50 వేల జీతం తీసుకుంటారా? అని విద్యార్థులను, యువతను ప్రశ్నించారు. ఎలాంటి భవిష్యత్తు కావాలో యువతే నిర్ణయించుకోవాలని లోకేశ్ అన్నారు.

 Love at first sight with Brahmani: Nara Lokesh on his love story

నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ రాలేదని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల కోసం యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, ఇంకో 9 నెలలు ఓపిక పట్టండి.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు లోకేష్. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళిక అమలు చేశామని అన్నారు.

ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని.. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకూ విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకువస్తామన్నారు. సామాజిక బాధ్యత, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారని లోకేశ్ గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+