మాట్లాడుతూనే హఠాత్తుగా యువతిపై దాడి, ఆ తర్వాత తాను ఆత్మహత్య
శ్రీకాకుళం: శ్రీకాకుళంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు.. యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనలో యువతితో పాటు ఆమె తల్లికి కూడా గాయాలయ్యాయి. ఈ సంఘటన పాతపట్నంలో చోటు చేసుకుంది. కృష్ణారావు అనే యువకుడు తిలక్ నగర్లో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు.

ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ, కృష్ణారావు కత్తితో భ్రమరాంభికపై దాడి చేశాడు. తల్లి అడ్డు వచ్చింది. వారికి గాయాలయ్యాయి. అనంతరం కృష్ణారావు బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకొని కత్తితో పొడుచుకొని చనిపోయాడు.
కాగా, కృష్ణారావు, ఆ యువతి మధ్య చాలా రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు అతను వచ్చినట్లుగా తెలుస్తోంది. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications