ప్రియురాలి నగ్నచిత్రాలతో బెదిరింపు, ప్రియుడివల్ల గర్భం

హైదరాబాద్/విజయవాడ
హైదరాబాద్/విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరులో దారుణం వెలుగు చూసింది. ఓ ప్రియుడు ప్రియురాలితో పెళ్లికి నిరాకరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు కోరింది. కుటుంబ సభ్యులు కూడా నిలదీశారు. అయితే, అందుకు అతను నిరాకరించాడు. అంతేకాదు, నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించాడు.

సెల్‌ఫోన్లో ఆమె నగ్న చిత్రాలను తీశాడు. కొందరు స్నేహితులకు నగ్న చిత్రాలను పంపించాడు. ఈ అవమానం భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు సేకరించారు. నిందితుడు రవిని పోలీసులు అరెస్టు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

పెళ్లి చేసుకోమంటే..

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలి పొట్టపై గ్దుద్దాడో ప్రబుద్ద్ధుడు. గర్భంతో ఉన్న ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కలవపాములకు చెందిన విజయలక్ష్మి(20)కి మూడేళ్ల క్రితం వివాహం జరుగగా అతనికి మరో మహిళతో సంబంధం ఉండటంతో ఆమె పుట్టింటికి వచ్చి ఉంటుంది.

రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల ఆమె గర్భం దాల్చింది. విజయలక్ష్మి ఈ నెల రెండో తేదీన అతనిని కలిసి తాను 8 నెలల గర్బిణీనని, వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. ఈ విషయమై ఇరువురి మధ్య వివాదం జరిగింది. ఈ గొడవలో విజయలక్ష్మి పొట్టపై రాజేష్‌ గుద్దాడు.

దీంతో రెండు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను తలిదండ్రులు మంగళవారం సాయంత్రం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే ఆమెను విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తలిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు రూరల్‌ పోలీసులు రాజేష్‌పై హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భర్త ప్రవర్తనతో విసిగి తనువు చాలించిన భార్య

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని కలత చెందిన ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం.. నెహ్రూ నగర్‌కు చెందిన ఆనంద్ కారు డ్రైవర్. నల్గొండ జిల్లా శాలీగౌరారానికి చెందిన బిక్షమయ్య కుమార్తె అనితతో అతనికి 2011లో వివాహం అయింది. వీరికి ఓ కూతురు ఉంది.

మద్యానికి బానిసైన ఆనంద్ మరో మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. భర్త ప్రవర్తనలో ఎంతకీ మార్పు రాకపోవడంతో అనిత మంగళవారం రాత్రి పడక గదిలో ఉరి వేసుకుంది. మీ కూతురు చనిపోయిందని ఆమె పుట్టింటికి ఫోన్ చేశాడు. బంధువులు వచ్చి భర్త పైన దాడి చేశారు. అతను పారిపోయాడు. భర్తే ఉరేసి చంపాడని ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+