పెళ్లికి ప్రియుడు నిరాకరణ: ప్రేయసి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం బండలేమూరులో సోమవారం వెలుగులోకి వచ్చింది.

ప్రేమించినందుకు గాను ప్రియుడిని పెళ్లి చేసుకోమని ప్రేయసి నిలదీసింది. పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రేయసి తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రియుడిపై మంచాల పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications