నెల రోజుల్లో పెళ్ళి ట్విస్టిచ్చిన యువతి, పెళ్ళైనా ప్రియురాలితో... భార్యకు షాకిచ్చిన భర్త
శ్రీకాకుళం: ప్రేమించుకొన్నారు. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకోలేకపోయారు ప్రియుడు మరో యువతిని వివాహం చేసుకొన్నాడు. అయినా తన ప్రియురాలితో ప్రేమను కొనసాగిస్తున్నాడు. అయితే ప్రియురాలికి వివాహం నిశ్చయమైంది. కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. దీంతో విషం తాగారు. ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
ప్రేమించుకొన్నారు. ప్రియుడు మాత్రం మరో యువతిని వివాహం చేసుకొన్నాడు. అయినా ప్రియుడిని విడిచి బతకలేనని ప్రియురాలు తేల్చి చెప్పేసింది.దీంతో కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం సుభద్రాపురంలో లలిత, మధుబాబులు కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. మధుబాబు మరో యువతిని వివాహం చేసుకొన్నాడు. లలిత మాత్రం మధుబాబును మర్చిపోలేదు. దీంతో వీరిద్దరూ చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం సుభద్రాపురంలో లలిత ఇంటర్ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన మధుబాబుతో లలిత ప్రేమించుకొంటున్నారు. మధుబాబు ప్రొక్లెయినర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ మధుబాబు మరో యువతిని వివాహం చేసుకొన్నాడు. పెళ్ళయ్యాక కూడ వీరిద్దరి మధ్య బంధం కొనసాగింది. లలితకు మరో యువకుడితో ఆమె కుటుంబసభ్యులు వివాహన్ని నిశ్చయించారు. దీంతో వారిద్దరూ కలిసి చావాలని నిర్ణయించుకొని విషం తాగారు. లలిత మృతి చెందింది. మధుబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కుటుంబ కారణాలతో మరో యువతితో పెళ్ళి
లలిత, మధుబాబులు కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా మధుబాబు అనివార్యంగా మరో అమ్మాయిని వివాహం చేసుకొన్నాడు. ఈ కారణంగానే పెళ్ళైనా కూడ లలితతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడు. లలితకు మరో యువకుడితో వివాహన్ని నిశ్చయించారు. దీంతో వారిద్దరూ విషం తాగినట్టుగా పోలీసులు తెలిపారు.

ఆలస్యంగా గుర్తించిన స్థానికులు
హీరమండలంలోని మేజర్ పంచాయతీ సులభాయమెట్టు తోట వద్దకు వెళ్లి లలిత, మధుబాబులు పురుగు మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు గుర్తించారు. అయితే అప్పటికే ఆలస్యం జరిగింది. ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే లలిత మృతి చెందగా మధుబాబు ప్రస్తుతం రిమ్స్‌లో వైద్యసేవలు పొందుతున్నాడు.

పెళ్ళికి భూమిని విక్రయించిన కుటుంబసభ్యులు
లలితకు పెళ్లి నిశ్చయమైంది. మే నెలలో పెళ్లి నిశ్చయమవడంతో ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మి పెళ్లి ఖర్చులకు కుటుంబ సభ్యులు వినియోగించారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న లలిత మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications