నోయిడాలో ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య: ఆమె చిత్తూరు జిల్లావాసి
న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీ నగర శివార్లలోని నోయిడాలో జరిగింది. నోయిడాలో సెక్టార్ 49 లోని సర్ఫాబాద్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రియుడు, వివాహిత మృతదేహాలు గుర్తించి ఆసుపత్రికి తరలించామని స్థానిక పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఎట్టెడ గ్రామానికి చెందిన దాక్షాయణి (30), బెంగళూరుకు చెందిన రేవన్నకు వివాహం అయ్యింది. వీరికి మహేష్ కుమార్ (5), మౌనిక (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బెంగళూరులో వీరు నివాసం ఉంటున్న పక్కింటిలో నవీన్ అనే యువకుడు అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. నవీన్, దాక్షాయణికి పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ అక్రమ సంబంధం సాగించారు.

తరువాత నవీన్ నోయిడా చేరుకుని ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. సర్ఫాబాద్ గ్రామంలో అద్దె ఇల్లు తీసుకున్నాడు. రెండు నెలల క్రితం తాను ఆంధ్రప్రదేశ్ లోని పుట్టింటికి వెళుతున్నానని దాక్షాయణి భర్త రేవన్నకు చెప్పింది.
పిల్లలను పిలుచుకుని చిత్తూరు వెళ్లకుండా నోయిడా చేరుకుంది. నవీన్ తో కలిసి అక్కడే కాపురం పెట్టింది. సమీపంలోని స్కూల్ లో కుమారుడు మహేష్ కుమార్ ను చేర్పించింది. మహేష్ కుమార్ స్కూల్ కు రాకపోవడంతో టీచర్ ఓ విద్యార్థిని నవీన్ ఇంటి దగ్గరకు పంపించింది.
తమ అమ్మా, అంకుల్ బాత్ రూంలోకి వెళ్లి తిరిగిరాలేదని మహేష్ కుమార్ ఆ విద్యార్థికి చెప్పాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి బాత్ రూం డోర్ పగలగొట్టి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు.
వెంటనే నవీన్, దాక్షాయణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి మృతదేహాలు ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. దాక్షాయణిని హత్య చేసి నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడా,ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications