మామూలు అత్త కాదురోయ్.. అల్లుడ్ని కిడ్నాప్ చేసి మరీ..
మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఇలా ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే ఘటనలు అధికం అవుతున్నాయి. ఇక్కడ ఓ అత్త చేసిన పనికి ఎవరైనా షాక్ అవుతారు. ఏకంగా ఇంటి అల్లుడ్నే కిడ్నాప్ చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం.. అల్లుడికి మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకుని పరార్ అయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. తన కూతురిని లవ్ మ్యారేజ్ చేసుకోవడమే కాకుండా.. తనకు దూరంగా పెట్టాడన్న కోపంతో ఆ మహిళ ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో షాకింగ్ ఘటన జరిగింది. డబ్బు కోసం లేదా ఆస్తి కోసం కిడ్నాప్ లు చేయడం చూసి ఉంటాం. కానీ ఈ కిడ్నాప్ గురించి తెలిస్తే నోరు వెళ్లబెడతారు. ఓ అత్త ఏకంగా అల్లుడినే కిడ్నాప్ చేసింది. యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు అత్త విజయలక్ష్మి.. ఆమెకు కిడ్నాప్ వ్యవహారంలో సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠ అనే యువకుడు రెండేళ్ల క్రితం లిఖిత అనే యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
తన కూతురికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అల్లుడు మణికంఠపై కక్ష పెంచుకుంది అత్త విజయలక్ష్మి. విజయలక్ష్మి వ్యవహారశైలి నచ్చకపోవడంతో దంపతులిద్దరూ ఆ ఇంటికి వెళ్లడం మానేశారు. దీంతో తన కూతుర్ని తనకు దూరం చేశాడన్న కోపం మణికంఠపై మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ఇటీవల అత్త విజయలక్ష్మి.. తన సహచరులతో కలిసి మణికంఠ ఇంటికి వెళ్లింది. మాట్లాడదామని బయటకు పిలిచి అతడిపై దాడి చేసి కారులో ఎక్కించుకుని పరారయ్యారు.

అయితే స్థానిక ఎస్సై మణికంఠకు స్నేహితుడు కావడంతో.. అతనికి కిడ్నాప్ విషయం తెలిపాడు. దీంతో పోలీసులు నిందితుల కారును వెంబడించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. తనను కిడ్నాప్ చేసి చంపేందుకు కుట్ర చేశారని మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications