Rain Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల కొనసాగుతోందని వివరించింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీ సహా తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అల్పపీడనం గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

దీనికి అనువైన వాతావరణం ఉన్నట్లు తెలిపింది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం క్రమంగా పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ, అండమాన్ దక్షిణ ప్రాంతంలో ప్రవేశించినట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో తమిళనాడు మొదలుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి.

Low pressure formed in Bay of Bengal is likely to turn into a cyclone

సోమవారం అర్ధరాత్రి నాగపట్నంలో అతి భారీ వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈశాన్య రుతుపవనాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 100 శాతం సిద్ధంగా ఉందని తమిళనాడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ మంగళవారం తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సలహా ఆధారంగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న మొత్తం 27 జిల్లాల కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.

నాగపట్నం, కడలూరు, అరియలూరు, తంజావూరు, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరువణ్ణామలై, దిండిగల్ (కొడైకెనాల్), పుదుక్కోట్టై (కంఠవర్కోట్టై, కరంబకుడి) వంటి ఇతర జిల్లాల్లో పాఠశాలలకు మాత్రమే సెలవు ఇచ్చారు. తమిళనాడు తీరం వెంబడి, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమొరిన్ ప్రాంతంలో గంటకు 40-45 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం నాడు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ సూచనను ఉటంకిస్తూ మంత్రి జిల్లా కలెక్టర్లు తెలియజేసారు.

చెంగల్పట్టు, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగ, తేని, మదురై, దిండిగల్ జిల్లాల్లో పర్యవేక్షణ అధికారులను నియమించారు. 121 బహుళ ప్రయోజన భద్రతా కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లతో కూడిన 4,967 రిలీఫ్ సెంటర్‌లు ప్రజలకు వసతి కల్పించేందుకు సిద్ధంగా ఉంచినట్లు మంత్రి తెలిపారు. చెన్నైలో ప్రభుత్వం 169 సహాయ కేంద్రాలను సిద్ధం చేశారు. 260 హైపవర్ మోటార్ పంపులు నిలిచిపోయిన నీటిని బయటికి పంపేందుకు సిద్ధంగా ఉంచారు.

అల్పపీడనం కారణంగా దక్షిణ తెలంగాణ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇటు ఉత్తర తెలంగాణలో ఆకాశం మేఘావృతమయ్యే అవకాశంఉన్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+