జాగ్రత్త!... ఏపీకి హెచ్చరిక పంపించిన బంగాళాఖాతం

రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనుండటంతోపాటు భారీ వర్షాలు పడనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించాలి
పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల,విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. ఏదైనా సహాయం అవసరమైన ప్రజలు టోల్‌ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 లో సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. శ్రీ సత్యసాయి, ఏలూరు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో నిన్న తేలికపాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆముదాల వలసలో 44.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

low pressure in bay of bengal ap rains update rains in andhra pradesh for the next three days

ఈ జిల్లాల్లో జల్లులు
అల్పడీన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో గత ఐదు రోజుల నుంచి ఏదో ఒక ప్రాంతంలో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు ఆకాశం మేఘావృతమై ఉంటోంది. మరో మూడురోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+