పొంచివున్న తుపాను ముప్పు.. ఏపీకి తీవ్ర హెచ్చరిక

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల ఏర్పడే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీనివల్ల రాబోయే నాలుగు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిసా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో ఉంది.

సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల ఎత్తులో
గురువారం అన్నమయ్య, శ్రీసత్యసాయి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను సుడి ఉండటంతో అది క్రమంగా బలపడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. సముద్రం నుంచి దాదాపు ఆరుకిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు.

low pressure in bay of bengal rain update in ap

ఓవైపు వానలు.. మరోవైపు ఎండలు
కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఉత్తర కోస్తా ప్రాంతంలో శని, ఆదివారాల్లో అతి భారీ వర్షాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

సముద్రం అలజడిగా ఉందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు జారీచేశారు. రానున్న సెప్టెంబరు నెలలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురిసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రంగా ఉంది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+