అల్పపీడనంతో ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు: ఆ బంగారపు మందిరం మయన్మార్‌దే
అమరావతి: అసని తుఫాను బుధవారం సాయంత్రం తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్నం, నర్సాపూర్‌కి తీరం దాటింది. గురువారం ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారి తీవ్ర అల్పపీడనంగా మారిందని అమరావతి వాతావరణ శా తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.

ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో ఉరుములతోకూడిన మోస్తరు వర్షాలు
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది. మే 14వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు
దక్షిణ కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండో చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉంది.

రాయలసీమలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు
రాయలసీమలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే అసని తుఫాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున పంటనష్టం జరగడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
సముద్రంలో కొట్టుకొచ్చిన ఆ బంగారపు గోపురం మయన్మార్‌దే..
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నపల్లి సముద్ర తీరానికి రెండు రోజుల క్రితం బంగారపు వర్ణంలో ఉన్న ఓ మందిరం కొట్టుకువచ్చింది. దీనిపై రాసివున్న భాష ఆధారంగా ఇది మయన్మార్‌కు చెందినదిగా అధికారులు తేల్చారు. ఈ మందిరం బంగారపు వర్ణంతో ఉండటంతో అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో ఈ గోపురం ఇక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలావుండగా, తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో అనకాపల్లి జిల్లా వడ్డాది వద్ద వంతెన కుంగిపోయింది. పెద్దేరు నదిపై నిర్మించిన ఈ వంతెన కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications