Cyclone Asani : బంగాళాఖాతంలో వాయుగుండం-నేడు తుఫానుగా-కోస్తా, సీమకు వర్షాలు
వేసవి ప్రారంభంతో ముచ్చెమటలు పడుతున్న వేళ ఏపీకి వాతావరణ విభాగం చల్లటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ అసాన్ తుపానుగా మారబోతోందని కూడా వెల్లడించింది.
Recommended Video

ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. ఇది కాస్తా ఇవాళ తుపానుగా మారబోతున్నట్లు ఇప్పటికే భారత వాతావరణవిభాగం ఐఎండీ వెల్లడించింది. ఈ తుపానుకు అసానీగా నామకరణం చేశారు. అసానీ తుపాను కారణంగా అండమాన్, పరిసర ప్రాంతాలు, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు, భారీ గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం ఏపీపైనా ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. సాయంత్రానికి తుపానుగా మారబోతోంది. ఇది ఉత్తర అండమాన్ దీవులవైపు పయనిస్తూ సాయంత్రానికి తుపానుగా మారబోతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాైలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది.
ఇప్పటికే పలు చోట్ల ఆకాశం మేఘావృతం అయి ఉంది. ఇది తుపాను ప్రారంభమైతే మాత్రం గాలులు, వర్షాలకు దారి తీసే అవకాశాలున్నాయి.ఇప్పటికే అండమాన్ కు వెళ్లే విమానాలను రద్దు చేశారు. అండమాన్ లో భారీ గాలులతో విధ్వంసం కూడా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications