రాహుగ్రస్త చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారు, వేములవాడ రాజన్న ఆలయాల మూసివేత!!
ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన చివరి సూర్యగ్రహణం ఏర్పడగా ఇప్పుడు అక్టోబర్ నెలలో 28వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. శారద పూర్ణిమ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్యం మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఫిబ్రవరి 29వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది.
ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రికి మూసివేయబడుతుంది. అక్టోబర్ 29న తిరిగి తెరవబడుతుంది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేస్తారు.

గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు వేయడం ఆనవాయితీ కావడంతో 28 రాత్రి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి.
ఇక ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధులకు అక్టోబర్ 28న తిరుమలలో స్వామివారి దర్శనం రద్దు చేయబడింది. ఇదిలా ఉంటే వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయాన్ని, ఈ నెల 28న చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు, ఆలయ అధికారులు తెలిపారు.
28న రాత్రి 1.16 నుంచి 1.51 గంటల వరకు రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుందని.. 28న సాయంత్రం 4.15 గంటల నుంచి ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి గ్రహణానంతరం 29న తెల్లవారుజామున 3.40 గంటలకు ఆలయంలో పుణ్యహవచనం, సంప్రోక్షణ, పూజల అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications