కెసిఆర్‌కు బందరు కోర్టు సమన్లు: రేవంత్ రెడ్డి ఫైర్
విజయవాడ/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు సోమవారం ఉదయం సమన్లు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కెసిఆర్ బ్రాహ్మణులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను సమన్లు జారీ అయ్యాయి.
ఈ నెల 21న తమ ముందు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. స్థానిక బ్రాహ్మణ సంఘం కెసిఆర్‌పై కేసు వేసింది. ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువని గతంలో కెసిఆర్ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

తెలంగాణ జిల్లాలో రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతులవి ఆత్మహత్యలో కాకమ్మ కథలో అని కెసిఆర్ అనడం సరికాదని ఆయన హైదరాబాదులో అన్నారు.
వ్యూమాత్మక మౌనం వహించాననడం బాధ్యతారాహిత్యమని ఆయన ధ్వజమెత్తారు. సీఎంగా ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నందున ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications