కేంద్ర సమాచార కమిషనర్‌గా మాడభూషి శ్రీధర్

వరంగల్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, జనధర్మ వారపత్రిక-వరంగల్ వాణి దినపత్రికల సంపాదకుడు ఎం.ఎస్.ఆచార్య, రంగనాయకమ్మ దంపతులకు 1956 నవంబర్ 10న ఆయన జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో, జర్నలిజంలో రెండు పోస్ట్‌గ్రాడ్యుయేషన్లను పూర్తిచేశారు. దాదాపు దశాబ్దకాలానికి పైగా పాత్రికేయుడిగా పనిచేసి 100కు పైగా పరిశోధన వ్యాసాలు రాశారు. ప్రేగ్‌లోని 'ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం'లో పాత్రికేయ శిక్షణ పొందారు.
ఇప్పటికీ పలు తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సమకాలీన అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు. మీడియా లా, జర్నలిజం అంశాలపై పాఠాలు రచించారు. దేశవిదేశాల్లో జరిగిన పలు సెమినార్లలో పాల్గొని పత్రాలను సమర్పించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, నిర్భయ యాక్ట్, లీగల్ లాంగ్వేజ్, లా ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ - న్యాయ, జర్నలిజం, సమాచార హక్కుచట్టాలపై తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో 30 పుస్తకాలు రచించారు. శ్రీధర్ ఉదయం తదితర దినపత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేశారు.
2011 ఆగస్టు1 నుంచి 2012 మార్చి 20 దాకా నల్సార్ వర్సిటీ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర సమాచార కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నందున నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పోస్టుకు 20వ తేదీన (బుధవారం) రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారాన్నిచ్చి గౌరవించింది.












Click it and Unblock the Notifications