మహా కుంభ మేళాలో టీటీడీ డొనేషన్ కియోస్క్

Maha Kumbh 2025: మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు పండగ వాతావరణం నెలకొంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.

సోమవారం తెల్లవారు జామున 5:15 నిమిషాలకు పౌష్య పూర్ణిమ తిథి ప్రవేశించిన ఘడియలో కుంభ మేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ కుంభ మేళా. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించనున్నారు.

Maha Kumbh 2025 Devotees throng Lord Venkateswara temple at Prayagraj set up by TTD

ఇప్పటికే విదేశీయుల తాకిడి సైతం మొదలైంది. ఈ తెల్లవారు జామున తొలి ఘడియలోనే రష్యాకు చెందిన పలువురు భక్తులు త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించారు. కుంభ మేళా కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మహా కుంభ మేళాలో పుణ్యస్నానాలను ఆచరించడంలో మకర సంక్రాంతిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీనితో పాటు మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధువులు చెబుతున్నారు.

కాగా- కుంభ మేళాకు ఉన్న విశిష్టతను దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వందలాది మంది దర్శించుకుంటోన్నారు. తిరుమల తరహాలోనే టీటీడీ ఇక్కడ నమూనా ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. స్వామివారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తోన్నారు అర్చకులు.

మంగళవారం సాయంత్రం 4 గంటలకు నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా ఊంజల్ సేవ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు హాజరై స్వామివారి వైభవాన్ని తిలకించి పులకించారు.

శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులు విరాళాలు సమర్పించడానికి వీలుగా టీటీడీ కీయోస్క్ మిషన్ (సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్) ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారా భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒక రూపాయి నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని టీటీడీకి విరాళంగా ఇవ్వవచ్చు. 18వ తేదీన ఉదయం 11 నుండి 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+