టీడీపీకీ ధీటుగా బీజేపీ, ఇంఛార్జ్ పురంధేశ్వరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్‌లైన్ నమోదులో భారతీయ జనతా పార్టీ సభ్యుల సంఖ్య 24 లక్షలకు చేరిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో బీజేపీకి ఏపీలో రెండు లక్షల మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం ఇది పన్నెండు రెట్లు పెరిగిందని చెబుతున్నారు.
విశాఖలో అత్యధికంగా 4 లక్షల పైగా సభ్యత్వాలు నమోదయినట్లుగా తెలుస్తోంది. ఆ త్రవాత స్థానాల్లో విజయవాడ సిటీ, చిత్తూరు, నెల్లూరు జల్లాలు నిలిచాయి. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
మహా సంపర్క్: పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మహాసంపర్క్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నాయకురాలు, మహాసంపర్క్ ఇంఛార్జ్ కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి శనివారం అన్నారు. జరిగిన మహాసంపర్క్ సమావేశానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీని మరింతగా బలోపేతం చేసేలా కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా రూ.10.50 కోట్ల సభ్యత్వం ఉందని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 37 లక్షల సభ్యత్వం నమోదైందన్నారు.
అయితే ఈ సభ్యత్వాల్లో ఎక్కడైనా లోపాలున్నాయా? లోపాలుంటే ఎలా సరిచేయాలన్న దానిపై కూడా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మహాసంపర్క్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. సంబంధిత నాయకులు ప్రతి సభ్యుడి ఇంటికి వెళ్లి వారికి బీజేపీ కార్యక్రమాల గురించి, పార్టీ ప్రాధాన్యత గురించి తెలియజేయాలన్నారు.












Click it and Unblock the Notifications