శ్రీశైలంలో ఆర్జిత సేవలు, వీఐవీ స్పర్శదర్శనాలు రద్దు.. ప్రత్యేక బస్సులు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు ఆరంభం కానున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ 11 రోజుల పాటు మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రతినిత్యం విశేషార్చనలు, ప్రత్యేక పూజలు, పలు వాహనసేవలు జరుగనున్నాయి. దీంతో పాటు కన్నుల పండువగా గ్రామోత్సవాలు నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ నిర్వహిస్తారు. 9న భృంగి వాహన సేవ, 10న హంస వాహనం, 11న మయూర వాహనం, 12న రావణ వాహనం, 13న పుష్ప పల్లకీ సేవ, 14 గజవాహన సేవ నిర్వహించనున్నారు. మహా శివరాత్రి రోజైన 15వ తేదీన ప్రభోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఆ ఒక్కరోజే నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ లీలాకల్యాణం వంటి ఉత్సవాలు జరుగుతాయి.

16వ తేదీన రథోత్సవం ఉంటుంది. మల్లన్న బంగారు తేరుపై ఊరేగుతాడు. అదే రోజు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. 17న యాగపూర్ణాహుతి, ధ్వజావరోహణ నిర్వహిస్తారు. 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ కూడా రద్దయ్యాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం వీటిని పునరుద్ధరిస్తారు. అలాగే- వీఐపీ స్పర్శ దర్శనాలను నిలిపివేశారు.
అదే సమయంలో స్వామివారికి నిర్వహించే నిత్యాలంకార దర్శన విధానాల్లో మార్పులు జరిగాయి. వీఐపీ విరామ దర్శనాలు మూడు స్లాట్లు, ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు నిరంతరం కొనసాగేలా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. స్పర్శ దర్శనాల విషయంలో మల్లన్నకు మొక్కులు సమర్పించే భక్తులను మినహాయించారు. ఈ నెల 12వరకు వారికి మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం లభిస్తుంది. కాగా భక్తులు వేచి ఉండేందుకు పూర్తి సదుపాయాలతో 20 కంపార్టుమెంట్లు సిద్ధం చేశారు. శివరాత్రికి ముందు నాలుగు రోజులపాటు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాల వితరణ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కాగా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని వివిధ డిపోల నుంచి శ్రీశైలానికి 195 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, డోన్, కోవెలకుంట్ల, నందికొట్కూరు, నంద్యాల నుంచి 90, చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, తదితర ఇతర జిల్లాల నుంచి 105 బస్సులను తీసుకొస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నారు. అటు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కూడా వివిధ డిపోల నుంచి శ్రీశైలానికి పలు బస్సులను నడిపించనుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications