హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌లో ఆందోళన, టిపై అంచనా తప్పింది కానీ: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మహానాడులో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భవిష్యత్తులో మనం ఉంటామా అనే ఆందోళన ఆ పార్టీలో ఉందన్నారు. కొత్తగా పార్టీ వచ్చినప్పుడు.. మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలోకి రాకుంటే ఆ పార్టీ మనుగడ సాధ్యం కాదన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏమయిందన్నారు. తెలంగాణలో టిడిపి ప్రతిపక్షంలో ఉందని, రాజీలేని పోరాటం చేస్తామన్నారు. 2019లో తెలంగాణలో తిరుగులేని మెజార్టీతో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో తానోమాట చెప్పానని... రెండు రాష్ట్రాల్లో మనమే అధికారంలోకి వస్తామని చెప్పానన్నారు. అన్నట్టుగా ఢిల్లీలో, సీమాంధ్రలో అధికారంలోకి వచ్చామన్నారు.

Mahanadu: Chandrababu lashes out at KCR and YS Jagan

తెలంగాణలో తన అంచనా తప్పిందని అయినా 2019లో అధికారంలోకి వస్తామన్నారు. ఆడపిల్లలకు గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ టిడిపియే అన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించింది ఎన్టీఆరే అన్నారు. మహిళలకు రిజర్వేషన్ పెట్టింది టిడిపియే అన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు వచ్చే వరకు టిడిపి పోరాడుతుందన్నారు. మహిళలను రక్షణ బాధ్యతను తాను ఓ అన్నగా తీసుకుంటానని చెప్పారు.

ఎర్రచందనం దొంగలపై వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేశారన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని యువత ప్రజల్లోకి తీసుకు వెళ్లిందన్నారు. తెరాస వార్ రూం ఎందుకు ప్రారంభించారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటి వరకు సిఎం అభ్యర్థి కెసిఆర్ నుండి
సమాధానం రాలేదన్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి టిడిపి బాధ్యత అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణలో లేదని, తెరాస సీమాంధ్రలో లేదని, కాంగ్రెసు మట్టికొట్టుకు పోయిందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు ప్రాంతాల్లో ఉండే పార్టీ టిడిపియే అన్నారు. ఇరు ప్రాంతాలను కలపగలిగే పార్టీ టిడిపియే అన్నారు. సీమాంధ్ర ప్రజల్లో కసి, అభద్రతా భావం, కోపం ఉందన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో మోడీలా కాంగ్రెసు పార్టీ ఎందుకు కలిసి పోలేదన్నారు.

సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని చెప్పారు. హైదరాబాదులాంటి నగరాలను సీమాంధ్రలో నాలుగైదు నిర్మించే శక్తి టిడిపికే ఉందన్నారు. రైతుల బాధ చూశాకే రుణమాఫీ ప్రకటించానని చెప్పారు. కేంద్రం తెలంగాణ బిల్లు పాస్ చేసినప్పుడు ఎవరితో చర్చించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారన్నారు.

విభజన విషయంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం మొదటి నుండి కోరింది టిడిపియే అన్నారు. నాటి కేంద్రమంత్రులకు సమన్యాయం తెలియకపోయిందని... కానీ గ్రామీణ ప్రజలు సహా తెలుగువారు ఇప్పుడు టిడిపికి అధికారం అప్పగించి సమన్యాయం ఏమిటో చూపించారన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోల్పోకుండా చూడాలన్నారు. హైదరాబాదులో ఉండే వారికి టిడిపి అండగా ఉంటుందని చెప్పారు.

వార్ రూంల వల్ల సాధించేదేమీ లేదన్నారు. కాంగ్రెసు పార్టీ కూడా వార్ రూం ఏర్పాటు చేస్తే ఏమయిందో తెలుసన్నారు. విభజన బిల్లులను కాంగ్రెసు పార్టీ డిఫెన్స్ విమానంలో పంపించిందని, ఇప్పుడు ఆ పార్టీ గల్లంతైందన్నారు. తెలుగు వారిని కాపాడగలిగే పార్టీ టిడిపి తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో టిడిపి జాతీయ పార్టీ అవుతుందన్నారు.

తెలంగాణతో, హైదరాబాదుతో సమానంగా సీమాంధ్రను అభివృద్ధి చేయాలన్నారు. తెలంగాణకు ఇచ్చిన హక్కులను ఎవరు టచ్ చేయవద్దన్నారు. టిడిపికి మంత్రి పదవులు రాకున్న ఫరవాలేదు కానీ సీమాంధ్ర అభివృద్ధికి సహకరించాలని మోడీని కోరినట్లు చెప్పారు. మోడీ సీమాంధ్రకు అండగా ఉంటానని చెప్పారని గుర్తు చేశారు. భారత దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్న పార్టీ టిడిపి మాత్రమే అన్నారు.

పార్టీలో కొంతమంది ఆయారాం గయారాం నాయకులు ఉన్నా... పార్టీని కాపాడింది కార్యకర్తలే అన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. అవినీతిరహిత భారత్... టిడిపి లక్ష్యమన్నారు. అవినీతి క్యాన్సర్ లాంటిదన్నారు. అవినీతికి టిడిపి వ్యతిరేకమన్నారు. అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తే దేశంలో పేదరికమే ఉండదన్నారు. వెనుకబడిన వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది టిడిపియే అన్నారు.

రౌడీయిజాన్ని, దోపిడీదారులను అణచివేస్తామని చెప్పారు. తాను నీతివంతులను, పార్టీ కోసం కష్టపడ్డ వారిని పైకి తీసుకు వస్తానని చెప్పారు. పార్టీ కోసం ఎవరు పని చేశారో, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేశారో... అన్ని వివరాలు ఇవ్వాలని, ఓడిపోయిన దగ్గర ఎందుకు ఓడిపోయామో కారణాలు చెప్పాలన్నారు. గెలిస్తే అందరు వస్తారని, ఓడిపోతే మాత్రం ఎవరు రారని చంద్రబాబు అన్నారు. అందరం తెలివితో పని చేద్దామన్నారు. ఎంత ఎక్కువ పని చేస్తే అంత చలాకీగా ఉంటామన్నారు.

నన్ను గుర్తు పెట్టుకునే విధంగా..

తనను ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పని చేస్తానన్నారు. తానొక్కడినే పని చేస్తే సరిపోదని, అందరు కష్టపడాలన్నారు. భారతదేశ అభివృద్ధి, సీమాంధ్ర పునర్నిర్మాణానికి పని చేద్దామన్నారు. బిల్లులో పొందుపర్చిన అంశాలపై స్పష్టత కోసం పట్టుబడతామన్నారు. గతాన్ని నెమరు వేసుకొని.. భవిష్యత్తును తీర్చి దిద్దుకుందామన్నారు. సీమాంధ్రకు అన్ని వనరులు ఉన్నాయన్నారు. ఏ పని చేసినా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని పని చేద్దామన్నారు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయమని ఎన్టీఆర్ చెప్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ దోచుకున్నా, లూటీ చేసినా ప్రజలు పట్టించుకోరని, టిడిపి అలా చేస్తే బాధపడతారన్నారు. నాడు ఎన్టీఆర్ తెలుగు జాతి కోసం పార్టీ స్థాపించారన్నారు. ఇప్పుడు 2014లో రెండు రాష్ట్రాల్లో తెలుగు జాతి కోసం పోరాడుదామన్నారు. 32 ఏళ్లలో అనేక మార్పులు వచ్చాయని, టిడిపి జాతీయ పార్టీగా ఆవతరించనుందన్నారు. సీమాంధ్రలో అభివృద్ధి, తెలంగాణలో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్నారు.

కాపులకు బిసి హోదా కల్పిస్తామని చెప్పారు. మైనార్టీలకు అండగా ఉంటామన్నారు. ప్రజలు నెలలో రెండు రోజుల ఆదాయం రాజధాని కోసం ఇవ్వాలని కోరారు. ఆదాయాన్ని ఒక ప్రాంతానికి కేటాయించారని, సీమాంధ్రకు నిధులు తేవాల్సిన అవసరముందన్నారు. 2019 ఎన్నికలకు ఇవాళే ప్రణాళిక ఉండాలన్నారు. తెలగాణలో ఉద్యమాలు చేయాల్సి ఉందని, పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు. మూడు నెలలకోసారి సమీక్షిస్తానన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu speech in Mahanadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X