బుర్రిపాలెంలో పూర్వీకుల ఇంట్లో మహేష్ బాబు, ఫ్యాన్స్ కేరింత
గుంటూరు: సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చేరుకున్నారు. తన బావ, ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి ఆయన గ్రామానికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
బుర్రిపాలెం గ్రామానికి చేరుకున్న మహేష్ బాబు నేరుగా.. తన తాత, తండ్రి నివసించిన ఇంటికి చేరుకున్నారు. వారు నివసించిన ఇంటిలోకి వెళ్లారు. పూర్వీకుల ఇంటికి వెళ్లి దానిని తేరిపారా చూశారు. మహేష్ బాబుకు 70 మంది బౌన్సర్లతో భద్రతను ఏర్పాటు చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహేష్ బాబు తన నానమ్మ కట్టించిన పాఠశాలతో పాటు గ్రామంలోని ఆసుపత్రి, పవర్ ప్లాంట్ తదితరాలను అభివృద్ధి చేసేందుకు గ్రామస్థులతో చర్చించనున్నారు. ఆ తర్వాత అభివృద్ధి పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.
తాడేపల్లిలో ఘన స్వాగతం
అంతకుముందు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా చేరుకున్నారు. తాడేపల్లి వద్ద ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో అవసరాలు తెలుసుకుని అభివృద్ధి గురించి గ్రామస్థులతో చర్చిస్తారు.
మహేష్ బాబు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఆయన తాడేపల్లి చేరుకోగానే పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు. అభిమానుల కేరింతల మధ్య, వారు ర్యాలీగా అనుసరిస్తుండగా మహేష్ బాబు బుర్రిపాలెం బయల్దేరారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications