మహేష్ బాబు ఇంట్లో విషాదం
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం కొత్తగా కనిపించేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. జిమ్ లో చెమటోడుస్తున్నారు. మరోవైపు ఆయన కూతురు సితార కూడా వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తోంది. అంతా హ్యాపీగా ఉన్న ఆ కుటుంబంలో తాజాగా విషాదం నెలకొంది. ఈ విషయమై మహేష్ బాబు కుమార్తె సితార కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..
దాదాపు ఏడు సంవత్సరాల నుంచి మహేష్ బాబు ఇంట్లో ఫ్లూటో అనే కుక్కను పెంచుకుంటున్నారు. తాజాగా అది మరణించడంతో సితార తట్టుకోలేకపోయింది. పప్పీతో తనకున్న బాండింగ్ ను గుర్తుచేసుకుంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీనికి నమ్రతా శిరోద్కర్ కామెంట్ పెట్టింది. ఫ్లూటో ఎప్పటికీ మన గుండెల్లో ఉంటుంది అని రాసుకొచ్చారు. ఫ్లూటో చనిపోవడంపై తన అకౌంట్ లో కూడా నమ్రత పోస్ట్ చేశారు. మహేష్ బాబు అభిమానులు ప్రస్తుతం సితారను ఓదారుస్తూ కామెంట్లు పెడుతున్నారు.

గుంటూరు కారం సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీలో మహేష్ బాబు నటించబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా క్లైమాక్స్ ఇంకో భాగం తీయడానికి ఆస్కారం కల్పించబోతోందని, ఈ సినిమా రెండు భాగాలుండే అవకాశం ఉందన్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ అవుతుందంటున్నారు.












Click it and Unblock the Notifications