తోడుదొంగలు గేమ్ బాగా ఆడుతున్నారు: పవన్-బాబులపై కత్తి మహేష్ సంచలనం, 'అంత మాటా!'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మహేష్ కత్తి దారుణమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌పై ఆయన సామాజిక అనుసంధాన వేదిక సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: కేఈ ప్రభాకర్ టిక్కెట్ కోసం కృష్ణమూర్తి ఏం చేశారంటే? జగన్‌కు అఖిల సహా వారి దెబ్బ

తన ఉనికిని అందరికి తెలియజేసేందుకే కత్తి మహేష్ పదేపదే పవన్‌ను విమర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఆయన కొట్టి పారేస్తున్నప్పటికీ అందరూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా చంద్రబాబు, పవన్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: మోడీ-బాబులకు దిమ్మతిరిగే 'పవర్' పంచ్: ఆ ముద్ర చెరిపేసుకొని, వైసీపీ నోరు మూయించేందుకు రెడీ

కత్తి మహేష్ స్పందన

కత్తి మహేష్ స్పందన

ఫాతిమా కాలేజీ విద్యార్థునుల అంశంపై జనసేన అధినేత పవన్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ఇప్పటికే నష్టం జరిగిందని, వారికి న్యాయం చేయాలని పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కత్తి మహేష్ స్పందించారు.

  Mahesh Kathi Posted Cartoons Against Pawan Kalyan Goes Viral
  వివాదాస్పద వ్యాఖ్యలు

  వివాదాస్పద వ్యాఖ్యలు

  ఆయన పేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. 'మొత్తానికి ఫాతిమా కాలేజీ విషయంలో ఇంతకాలానికి చంద్రబాబు ఒకే అన్నాడన్నమాట. ఈ రోజు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. తోడు దొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు' అని తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు

  ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు

  రెండు రోజుల క్రితం ఏపీ దేవాదాయ శాఖ తీరును కూడా కత్తి మహేష్ ప్రశ్నించారు. జనవరి 1వ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ తీసుకోగా.. హిందుత్వ రాజకీయాలకు తెరతీత అని పోస్ట్ పెట్టారు. అయితే, దేవాలయాల గురించి కాబట్టి దేవాదాయ జీవో జారీ చేసిందని, ఆ జీవోపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. అంతగా అయితే దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేయవచ్చు కదా అనే వాదనలు వినిపించాయి. అర్థం లేని మాటలుగా చాలామంది కొట్టిపారేశారు.

  పవన్ కళ్యాణ్ చురకలపై

  పవన్ కళ్యాణ్ చురకలపై

  కత్తి మహేష్ తీరు చూస్తుంటే ప్రచారం కోసమే పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారనేందుకు.. కేవలం ఆయన గురించే పదేపదే విమర్శలు చేయడమే నిదర్శనం అంటున్నారు. మంగళవారం పవన్ పాతిమా కాలేజీ పైన చేసిన ట్వీట్ చంద్రబాబుతో పాటు మోడీ ప్రభుత్వాన్ని కూడా నిలదీసేలా ఉంది. విద్యార్థులు తమ విలువైన సంవత్సరాన్ని కోల్పోతుంటే ప్రభుత్వాలు తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు రచించడంలో బిజీగా ఉన్నాయని చురకలు అంటించారు.

  పవన్ ప్రశ్నిస్తే అంతటి మాటలా

  పవన్ ప్రశ్నిస్తే అంతటి మాటలా

  ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే సమస్యల పరిష్కారం లభిస్తుందని బాధితులు భావిస్తున్నారు. ఉద్ధానం సమస్యపై పవన్ కృషిని ఎవరూ ప్రశ్నించలేనిది. చంద్రబాబు వైపు ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని గుర్తుంచుకోవాలని అంటున్నారు. భయంతోనే, గత ఎన్నికల్లో మద్దతిచ్చారనే గౌరవంతోనో టీడీపీ ప్రభుత్వం పవన్ ప్రశ్నిస్తే స్పందిస్తుందని అభిమానులు గుర్తు చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం పవన్ ప్రశ్నిస్తే నాటకాలు అనడం విడ్డూరమని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mahesh Kathi hot comments on Jana Sena chief Pawan Kalyan and Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి