వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ-బాబులకు దిమ్మతిరిగే 'పవర్' పంచ్: ఆ ముద్ర చెరిపేసుకొని, వైసీపీ నోరు మూయించేందుకు రెడీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు చురకలు అంటించారు. సందర్భం వచ్చినప్పుడల్లా సమస్యను లేవనెత్తి ప్రభుత్వాలకు హితబోధ చేస్తున్నారు జనసేనాని. తాజాగా, మంగళవారం ఫాతిమా విద్యార్థుల అంశాన్ని మరోసారి సీఎం దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.

చదవండి: రాజ్‌భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ: బాబుతో ఆత్మీయంగా, సీఎంలతో చిరంజీవి ఇలా (ఫోటోలు)

దయచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతూనే, ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఇటీవలే అజ్ఞాతవాసి సినిమా పూర్తి చేసుకున్న పవన్ ఇక జనసేన బలోపేతంపై దృష్టి సారించనున్నారు. పవన్ తనను తాను పొలిటికల్ కూలీగా అభివర్ణించుకున్నారు.

చదవండి: కేఈ ప్రభాకర్ టిక్కెట్ కోసం కృష్ణమూర్తి ఏం చేశారంటే? జగన్‌కు అఖిల సహా వారి దెబ్బ

దూరం పాటిస్తూనే, ఆ ముద్ర చెరిపేసుకునేందుకా

దూరం పాటిస్తూనే, ఆ ముద్ర చెరిపేసుకునేందుకా

గత మూడేళ్లుగా పవన్ పలు సమస్యలపై కదిలారు. ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబుకు ఇబ్బంది ఉన్నప్పుడే ఆయన బయటకు వస్తారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. ఇప్పుడు జనసేన బలోపేతంపై దృష్టి సారించిన పవన్ క్రమంగా ఆ ముద్ర చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

బీజేపీ, టీడీపీలకు దూరం

బీజేపీ, టీడీపీలకు దూరం

2019లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి దూరం పాటించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పవన్ తీరు చూస్తుంటే 2019లో టీడీపీతో కలిసే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుతోనే సాగుతారనే వాళ్లు లేకపోలేదు. ఓ వైపు సమస్యలపై చంద్రబాబుకు చురకలు అంటిస్తూనే మరోవైపు విజ్ఞప్తి చేస్తున్నారు.

Recommended Video

Pawan Kalyan Is Quitting From Films
వైసీపీ నోరు మూయించేందుకు..

వైసీపీ నోరు మూయించేందుకు..

ఈ ప్రపంచాన్ని మార్చే వందమందిలో ఒకరుగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పారని, ఆ వందమందిలో తాను ఉండాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు. జనసేన సీరియస్ ఉన్న పార్టీ కాదని వైసీపీ నేతలు ఇప్పటి దాకా ఆరోపిస్తున్నారు. త్వరలో పర్యటన లేదా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా వారి నోళ్లను కూడా మూయించాలనుకుంటున్నారు.

వరుస ట్వీట్లు

వరుస ట్వీట్లు

ఇదిలా ఉండగా, తాజాగా పవన్ చేసిన ట్వీట్ చంద్రబాబుతో పాటు మోడీ ప్రభుత్వాన్ని కూడా నిలదీసేలా ఉంది. ఫాతిమా విద్యార్థుల కోసం ఆయన మరోసారి గళం విప్పారు. విద్యార్థులు తమ విలువైన సంవత్సరాన్ని కోల్పోతుంటే ప్రభుత్వాలు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు రచించడంలో బిజీగా ఉన్నాయని గట్టి పంచ్ ఇచ్చారు.

కళ్యాణ్

కళ్యాణ్

వరుస తన ట్వీట్లలో.. 'నెపోలియన్‌ ఒకసారి ఏం చెప్పారంటే మనం కోల్పోయే ప్రతీ గంటా భవిష్యత్‌ను దురదృష్టకరం చేసుకునేందుకు అవకాశం కల్పించడమే. కానీ, ఫాతిమా మెడికల్‌ కళాశాల విద్యార్థుల జీవితాల్లో అది ముందే వచ్చేసింది. బాధ్య‌తారాహిత్య‌మైన‌, అనాలోచిత, అత్యాశ కలిగిన మేనేజ్‌మెంటే అందుకు కారణం. ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంతో బాధతో చేసిన విన్నపాలను కేంద్ర, రాష్ట్రాలు గుర్తించకుండా కాలయాపన చేశాయి. ఫాతిమా మెడికల్‌ కళాశాల చేసినట్లు విదేశాల్లో జరిగితే భారీగా జరిమానా విధించడంతో పాటు, అనుమతులను రద్దు చేసి, మేనేజ్‌మెంట్‌ను జైలుకు పంపేవాళ్లు' అని పవన్ పేర్కొన్నారు. 'మనదేశంలో సామాన్యులు, నిస్సహాయులపై వేగంగా పనిచేసే చట్టం.. అధికారం, అంగబలం ఉన్న వారి విషయంలో సమర్థంగా, వేగవంతంగా పని చేయటం లేదు. వచ్చే ఎన్నికల సన్నాహాల్లో పడి ప్రభుత్వాలు ప్రస్తుత విద్యావ్యవస్థ ప్రక్రియను, విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోవడం లేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నా విన్నపం. ఫాతిమా మెడికల్‌ కళాశాల విద్యార్థులు ఎంతో విలువైన సమయాన్ని డబ్బును ఇప్పటికే కోల్పోయారు. తమ స్వేదాన్ని, రక్తాన్ని చిందించి విద్యార్థుల చదువు కోసం ఫీజులు కట్టిన తల్లిదండ్రులకు ఇప్పుడు ఓదార్పు కావాలి. అయితే ఈ విషయంలో మేనేజ్‌మెంట్‌ నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తోంది. దయచేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడండి' అని ట్వీట్ చేశారు.

English summary
Jana Sena chief Pawan Kalyan tweet on Fatima College Students on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X