అడుక్కోవడం కాదు: విభజన అంశంపై మహేష్ కత్తి, వెనుక జగన్ ఉన్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: మీడియాలో నానేందుకు నిత్యం ఏవరి పైనో లేక ఏదో అంశం పైనో స్పందిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మహేష్ కత్తి తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ఏపీకి చేవగల ఎంపీలు కావాలంటూ గురువారం పోస్ట్ పెట్టిన ఆయన, తాజాగా విభజన హామీలపై స్పందించారు.

'విభజన హామీల కోసం పోరాడటం అంటే అడుక్కోవడం, లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం కాదు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల కోసం పార్లమెంటు ప్లోర్ మీద పోరాడాలి.' అని సామాజిక అనుసంధాన వేదిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ట్రిపుల్ తలాక్‌పై మహేష్ కత్తి

ట్రిపుల్ తలాక్‌పై మహేష్ కత్తి

గురువారం లోకసభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ పైనా కత్తి మహేష్ స్పందించారు. ఇది మంచి నిర్ణయమని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఇక యూనిఫాం సివిల్ కోడ్ కూడా తీసుకొని వస్తే ప్రజాస్వామ్యానికి మంచిది అన్నారు. ముస్లీం మహిళలకు గౌరవం కల్పించేందుకు కేంద్రం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బిల్లును లోకసభలో ఆమోదింప చేసిన విషయం తెలిసిందే.

ప్యాకేజీ తీసుకుంటున్నారా, లెక్కేంటి?: పవన్‌పై మహేష్ కత్తి కొత్త డౌట్లు ఎన్నో

వారిద్దర్నీ టార్గెట్ చేస్తూ కత్తి మహేష్

వారిద్దర్నీ టార్గెట్ చేస్తూ కత్తి మహేష్

ప్రసార మాధ్యమాల్లో తన పేరు వినిపించేందుకు, ప్రజల్లో నానేందుకు కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వరుసగా విమర్శలు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన పదేపదే తన పోస్టులలో పవన్‌పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా అప్పుడప్పుడు టార్గెట్ చేశారు

జేసీ దుమారం, ఇక అంతేనా?: బాబు పక్కా ప్లాన్, మోడీపై ఆగ్రహంతోనే గుజరాత్‌కు దూరం

వెనుక జగన్ ఉన్నారా?

వెనుక జగన్ ఉన్నారా?

ఓ వైపు పవన్‌ను విమర్శిస్తూనే మరోవైపు ఏపీ ఎంపీలు, విభజన హామీలపై తాజాగా స్పందించారు. కత్తి మహేష్ పదేపదే పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన వెనుక జగన్ ఉన్నాడనే విమర్శలు గతంలో వచ్చాయి.

కత్తి మహేష్ వెనుక జగన్ ఉన్నడనడానికి కారణాలు ఇవేనా?

కత్తి మహేష్ వెనుక జగన్ ఉన్నడనడానికి కారణాలు ఇవేనా?

కత్తి మహేష్ వెనుక జగన్ ఉన్నాడు అని చెప్పేందుకు కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు, జగన్ అధికార, ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు. పవన్ పలు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ త్వరలో రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నారు. కానీ కత్తి మహేష్ పదేపదే పవన్, ఆ తర్వాత బాబునే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.

జగన్‌ను విమర్శించవచ్చు కదా

జగన్‌ను విమర్శించవచ్చు కదా

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నోరు మెదపడం లేదని, ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడుతున్నప్పుడు వైసీపీ గురించి కూడా మాట్లాడాలి కదా అని అంటున్నారు. అయితే ఇక్కడ తాను జగన్ అనుకూలురు అనే ముద్రపడకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారని కూడా చెబుతున్నారు.

వ్యూహాత్మకంగా మహేష్ కత్తి పోస్టులు?

వ్యూహాత్మకంగా మహేష్ కత్తి పోస్టులు?

'ఏపీకి చేవగల ఎంపీలు కావాలని', 'విభజన హామీల కోసం పోరాడటం అంటే అడుక్కోవడం, లోపాయకారి ఒప్పందాలు' కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను అందరిని విమర్శించారనే అర్థం వచ్చేలా పేర్కొన్నారు. జగన్ మద్దతుదారుగా ఎవరూ భావించవద్దనే అలా పేర్కొని ఉంటారని అంటున్నారు. కానీ ఆయన వెనుక జగన్ ఉన్నట్లుగానే భావించవచ్చునని కొందరు అంటున్నారు. అందుకు కారణం.. ఆయన ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్‌ను అంటున్నారు. కానీ ఎక్కడ జగన్‌ను విమర్శించలేదని గుర్తు చేస్తున్నారు. ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahesh Kathi on Triple Talaq and Centre promises

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి