చంద్రబాబు ప్రభుత్వం వైఖరి డౌన్ డౌన్, తీవ్రంగా ఖండిస్తున్నా: మహేష్ కత్తి
హైదరాబాద్/అమరావతి: నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తూ మీడియాలో నానిన మహేష్ కత్తి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఆయన సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేశారు.
గొట్టిపాడు గ్రామంలో దళితుల బహిష్కరణను తీవ్రంగా ఖండిస్తున్నామని, చంద్రబాబు ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరి డౌన్ డౌన్ అంటూ పోస్ట్ పెట్టారు.

అంతకుముందు కూడా మహేష్ కత్తి ఓ పోస్ట్ పెట్టారు. ఆయన రెండు రోజుల క్రితం ప్రత్యేక హోదా అంశం గురించి పోస్ట్ చేశారు. 'ప్రత్యేక హోదా మాత్రమే కాదు. అన్ని విభజన హామీల గురించి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇలాగే ఆలస్యం చేస్తే,వాటికి చట్టబద్దత నశించే ప్రమాదం ఉంది.' అని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications