పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తా, జగన్‌దీ తప్పే: మహేష్ కత్తి

Recommended Video

    పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తా : నడిరోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు పై మహేష్ కత్తి !

    హైదరాబాద్: తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తానని సినీ విమర్శకుడు మహేష్ కత్తి చెప్పారు. ఆదివారం హైదరాబాదు ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్ చర్చలో పాల్గొన్నారు.

    మీ వెనక ఎవరున్నారని అడిగితే తన వెనక ఎవరూ లేరని సమాధానమిస్తూ తాను వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తానని, ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తానని ఆయన చెప్పారు.

     జగన్ ప్రకటన ప్రస్తావన

    జగన్ ప్రకటన ప్రస్తావన

    తనను చంపాలన్నట్లు పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారని కత్తి మహేష్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసను ప్రేరేపించడం నేరమని అంటూ పవన్ కల్యాణ్ దీన్ని ఎందుకు ఖండించడం లేదని మహేష్ కత్తి ప్రశ్నించారు. దానికి మీడియా ప్రతినిధుల స్పందిస్తూ చంద్రబాబును నడిరోడ్డు మీద కాల్చి చంపిన తప్పులేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు కదా, దాన్ని మీరు ఖండించారా అని అడిగారు.

     ఖండించా, జగన్‌దీ తప్పే..

    ఖండించా, జగన్‌దీ తప్పే..

    జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యను తాను ఖండించానని, ప్రజాస్వామ్యంలో హింసకు ఎవరూ మద్దతివ్వరని, ఆ మాట ఎవడన్నా తప్పేనని, జగన్ అన్నా తప్పేనని, ఏమిటిప్పుడు అని మహేష్ కత్తి అన్నారు.

     జనవరి 1వ తేదీన్నే నిర్ణయం

    జనవరి 1వ తేదీన్నే నిర్ణయం

    పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదంపై జనవరి 1వ తేదీననే ఒక నిర్ణయం తీసుకున్నానిన కత్తి మహేశ్ అన్నారు. తన అభిమానుల తీరుపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడంతో తన నిర్ణయం తాను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ని రోజులు అర్థించానని, ఇకపై అర్థించబోనని స్పష్టం చేశారు. తన హక్కుల కోసం తాను పోరాడుతానని అన్నారు

     పవన్ ఎందుకు స్పందించడం లేదని...

    పవన్ ఎందుకు స్పందించడం లేదని...

    తాను చేస్తున్న పోరాటంలో ఇప్పుడు వెనక్కి తగ్గేది లేదని మహేష్ కత్తి చెప్పారు. తాను తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, భావప్రకటనా స్వేచ్చ కోసం పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు. తన అభిమానులను పవన్ కల్యాణ్ నియంత్రిస్తానని ఇన్నాళ్లు అభ్యర్థించానని, ఇక అభ్యర్థించబోనని, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాటం చేస్తానని ఆయన అన్నారు. ప్రాణాల కన్నా ఆత్మగౌరవం ముఖ్యమని అన్నారు.

     పవన్ స్వామీజీ ఏం కారు

    పవన్ స్వామీజీ ఏం కారు

    కులం, వర్ణం, ధనం వంటివాటిని ప్రాతిపదికగా చేసుకొని తనను, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నా పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని మహేష్ కత్తి అన్నారు. పవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉంటే, దాడిని ఆపాలని అభిమానులకు సూచిస్తూ ఓ ట్వీట్ చేసినా సరిపోయేదని అన్నారు. వివాదం ఉండేది కాదని అన్నారు.సూక్తులు, నీతులు చెప్పడానికి పవన్ కల్యాణేమీ స్వామీజీ కాదని, రాజకీయ నాయకుడు కాబట్టి స్పందించాలని మహేష్ కత్తి అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+