నాంపల్లి లేదా లష్కర్: మాజీద్ హుసేన్ రిజైన్ వెనుక...!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి మజ్లిస్ పార్టీ నేత మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) కమిషనర్ సోమేష్ కుమార్‌కు ఆయన అందజేశారు.
కాంగ్రెస్ - ఎంఐఎం పొత్తులో భాగంగా తమ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజిద్ ప్రకటించారు. కాగా దీని వెనుక అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ - ఎంఐఎం పార్టీల మధ్య సంబంధాలు దూరం కావడం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించక పోవడం వంటి పరిణామాల ఫలితంగా మజ్లిస్ పార్టీ భవిష్యత్‌లో తెరాసతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మాజిద్ హుస్సేన్
మేయర్ మాజిద్ హుస్సేన్ మాత్రం తాను ఎంఐఎం ఆదేశాల ప్రకారం పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో నాంపల్లి నియోజక వర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి మాజిద్ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.

మాట్లాడుతూ..
మరోవైపు మాజిద్ హుస్సేన్ పేరు సికింద్రాబాద్ లోకసభకు కూడా మజ్లిస్ పార్టీ పరిశీలస్తున్నట్లు తెలుస్తోంది. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల మాట్లాడుతూ... సికింద్రాబాద్ లోకసభకు తాము పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

మాజిద్
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోకసభ బరిలో మాజిద్ హుస్సేన్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందని చర్చించారట. అయితే, అతను నాంపల్లి నుండి అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా సికింద్రాబాద్ నుండి లోకసభకు పోటీ చేస్తారా త్వరలో తెలియనుంది.

హుస్సేన్
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి మజ్లిస్ పార్టీ నేత మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) కమిషనర్ సోమేష్ కుమార్‌కు ఆయన అందజేశారు.












Click it and Unblock the Notifications