సినిమా షూటింగ్‌ను తలపించిన రోడ్డు ప్రమాదం (ఫోటోలు)
విశాఖపట్నం: రాయవరం మండలంలోని పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. వర్షం పడుతుండగా యలమంచిలి నుంతి తునివైపు వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో రెండు లారీలు, వోల్వో బస్సు, రెండు కారులు ఒకదానివెంట మరొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదం జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యం గొలిపింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు లారీ క్లీనర్‌లతో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో బస్సును ఢీకొన్న కారులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి.
20 మంది ప్రయాణీకులతో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళుతున్న బస్సు లారీని ఢీకొట్టి నుజ్జు నుజ్జు అయింది. ఆదివారం ఉదయం ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం ఏర్పడింది.
దీంతో సమాచారం అందుకున్న రాయవరం ఎస్సై కె శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకుని బాధితులను నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సినిమా షూటింగ్‌ను తలపించిన రోడ్డు ప్రమాదం
రాయవరం మండలంలోని పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. వర్షం పడుతుండగా యలమంచిలి నుంతి తునివైపు వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో రెండు లారీలు, వోల్వో బస్సు, రెండు కారులు ఒకదానివెంట మరొకటి ఢీకొన్నాయి.

సినిమా షూటింగ్‌ను తలపించిన రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదం జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యం గొలిపింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు లారీ క్లీనర్‌లతో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో బస్సును ఢీకొన్న కారులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి.
సినిమా షూటింగ్‌ను తలపించిన రోడ్డు ప్రమాదం
20 మంది ప్రయాణీకులతో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళుతున్న బస్సు లారీని ఢీకొట్టి నుజ్జు నుజ్జు అయింది. ఆదివారం ఉదయం ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం ఏర్పడింది.

సినిమా షూటింగ్‌ను తలపించిన రోడ్డు ప్రమాదం
దీంతో సమాచారం అందుకున్న రాయవరం ఎస్సై కె శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకుని బాధితులను నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Click it and Unblock the Notifications