ఈ నెల 16న టిడిపిలోకి మాకినేని పెదరత్తయ్య
గుంటూరు: ప్రముఖ రాజకీయ నాయకుడు మాకినేని పెదరత్తయ్య తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. టిడిపికి రాజీనామా చేసి ఆయన 2010 డిసెంబర్‌లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే, అక్కడ తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో చాలా కాలంగా అసంతృప్తి ఉన్నారు. తిరిగి ఆయన తెలుగుదేశం గూటిలోకి చేరుతున్నారు.
ఈ నెల 16వ తేదీన గుంటూరులో రైతు గర్జన సదస్సు సందర్భంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టిడిపిలో చేరుతారు. ఆయనను పార్టీలోకి తేవడానికి శాసనసభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి మధ్యవర్తిత్వం నెరిపినట్లు తెలుస్తోంది. మాకినేని పెదరత్తయ్య చందర్బాబుతో మాట్లాడి తన ప్రవేశానికి మార్గం సుగమం చేసుకున్నారు. చాలా కాలం క్రితమే పెదరత్తయ్యకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రావు వెంకటరమణతో విభేదాలు పొడసూపాయి.

పెదరత్తయ్యను బుజ్జగించడానికి గుంటూరు జిల్లాకే చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అప్పట్లోనే బుజ్జగించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లభించలేదు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య గతంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీలోకి పాత కాపులందరూ వచ్చి చేరుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. ఆయన చేరికకు ముహూర్తం కూడా ఖరారైంది.












Click it and Unblock the Notifications