హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మక్కా మసీదు పేలుళ్లు: ప్రభుత్వానికి హైకోర్టు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Makkah Masjid blast
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో 70 మంది ముస్లిం యువకులకు చెల్లించిన నష్టపరిహారం విషయంలో రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. తప్పుడుగా అరెస్టు చేశారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 70 మంది ముస్లిం యువకులకు నష్టపరిహారం చెల్లించింది. ఆ నష్టపరిహారాన్ని తిరిగి రాబట్టుకోవాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మక్కా మసీదు పేలుళ్ల తర్వాత 70 మంది ముస్లిం యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేయడం సరి కాదంటూ 2007లో విడుదల చేశారు. వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. అది చట్ట సమ్మతం కాదని తెలిపింది.

ప్రభుత్వం తన పరిధిని దాటి నష్టపరిహారం చెల్లించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నష్టపరిహారం కోసం ఫిర్యాదుదారులు సివిల్ కేసు దాఖలు చేసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. మక్కా మసీదు పేలుళ్ల తర్వాత చాలా మంది ముస్లిం యువకులను అదుపులోకి తీసుకుని వేధించారనే ఆరోపణలు వచ్చాయి.

జాతీయ మైనారిటీ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 50 మంది ముస్లిం యువకులకు 20 వేల రూపాయల చొప్పున, 20 మందికి 3 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. ఇందులో చాలా వరకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఈ విషయంలో ప్రభుత్వం అపీల్‌కు వెళ్లే అవకాశం ఉంది.

English summary
Andhra Pradesh High Court on Tuesday cancelled the compensation given to 70 Muslim youths wrongly arrested in connection with blasts cases and asked the state government to recover money from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X