తెలుగు ప్రజలకు బాబు చెడ్డపేరు: మల్లాది విష్ణు, కెసిఆర్ భాషఫై ఎమ్మెల్యే

విజయవాడ/ అనంతపురం: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసులో టేపుల వ్యవహారం తమ రాష్ట్ర ప్రజలకు సంబంధించినది కాదని, తెలుగు ప్రజలకు చెడుపేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.

కల్తీ నెయ్యిగా నిర్థారనైన నందిని నెయ్యి ప్యాకెట్లను ‘చంద్రన్న సంక్రాంతి' పథకంలో ఎందుకు చేర్చారని ఆయన శుక్రవారం విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. నందిని నెయ్యి ప్యాకెట్లలోని కల్తీని సాక్షాత్తు ఎమ్మెల్యే బోండా ఉమ బయటపెట్టారని, అలాంటి కల్తీ నెయ్యిని ప్రజలకు పంపిణీ చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు.

Malladi Vishnu deplores Chandrababu attitude in cash for vote case

కల్తీ నెయ్యి ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రెండు ప్రాంతాల్లో పార్టీ ఉండాలన్న చంద్రబాబు తీరువల్లే సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలో చంద్రబాబు వైఫల్యంపై ఈనెల ఇందిరాపార్క్‌ ధర్నా నిర్వహించనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భాష మార్చుకోవాలని ఎమ్మెల్యే బీకే పార్ధసారథి కోరారు. తాము నోరు తెరిస్తే భస్మం అవుతారని ఆయన హెచ్చరించారు. జగన్‌ రాయలసీమ ద్రోహి అని పట్టిసీమను ఆపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాయలసీమను ఎడారిగా మారాలని జగన్‌ కోరిక అని ఆయన ఆరోపించారు. రాబోయే కాలంలో జగన్‌కు పుట్టగతులు ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+