కల్తీ మద్యం కేసు: 9 మందికి బెయిల్, మల్లాది సోదరులు మాత్రం జైల్లోనే

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన విజయవాడలోని కల్తీ మద్యం కేసులో అరెస్టైన నిందితులకు స్వల్ప ఊరల లభించింది. నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను మంగళవారం విచారించిన విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 9 మంది బార్ సిబ్బందికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే, నగరంలోని కృష్ణలంకలో కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్వర్ణబార్‌... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినది కావడంతో ప్రభుత్వం వేగంగా స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది.

malladi vishnu in Jail remaining are got bail in adulterated alcohol case

ఈ దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన సిట్ (ప్రత్యేక అధికారుల బృందం) స్వర్ణబార్‌లోని మద్యంలో కల్తీ జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చడంతో బార్‌లో పనిచేస్తున్న మేనేజర్‌తో సహా మొత్తం 9మందిని అరెస్ట్ చేసింది. ఇటీవలే సిట్ ముందు విచారణకు హాజరైన మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ను కూడా అరెస్ట్ చేసింది.

అయితే మల్లాది విష్ణు, అతని సోదరుడు శ్రీనివాస్‌కు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో వాళ్లు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సుమారు రెండు రోజుల పాటు సిట్ బృందం విచారించిన తర్వాత కల్తీ మద్యం కేసులో బార్‌ను అక్రమంగా నడుపుతున్నారని, సిట్ ముందు పొంతన లేని సమాధానాలు చెప్పినందుకు విష్ణుని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+