చంద్రబాబుకు మమత బెనర్జీ సమాధానం ఇదీ!, అమిత్ షాకు జగన్ హామీ
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బిజెపి ప్రకటించింది. ఆయా పార్టీల మద్దతును కూడగట్టేందుకు కొందరు నేతలు బాధ్యత తీసుకున్నారు.
అమరావతి/న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బిజెపి ప్రకటించింది. ఆయా పార్టీల మద్దతును కూడగట్టేందుకు కొందరు నేతలు బాధ్యత తీసుకున్నారు.
ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు కూడగట్టే బాధ్యతను ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులకు అప్పగించారు.

సోమవారం అభ్యర్థిని ప్రకటించిన అనంతరం చంద్రబాబు.. మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె నుంచి చంద్రబాబుకు ఆశించిన సమాధానం రాలేదని తెలుస్తోంది. అయితే విషయాన్ని పెండింగులో పెట్టారు.
చంద్రబాబు మద్దతు కోరారు. దానికి మమత సమాధానమిస్తూ.. తాను నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్నానని, వచ్చిన వెంటనే ఈ విషయంపై మాట్లాడతానని చంద్రబాబుతో అన్నారని తెలుస్తోంది.
ఈ ఉదయమే మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె నెదర్లాండ్స్ వెళ్లారు. ఇటీవలే ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ... ఎన్టీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో వెల్లడైన తర్వాతే మద్దతు ప్రకటించాలా? లేదా? అనే విషయం గురించి తాము ఆలోచిస్తామన్నారు.
మరోవైపు, రామ్‌నాథ్ కోవింద్ పేరు ప్రకటించడంపై మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యున్నత పదవికి ఒక దళితుడిని ఎంపిక చేశామని బిజెపి చెప్తోందన్నారు. అయితే, కోవింద్ బిజెపికి చెందిన దళిత్ మోర్చా నాయకుడని, అందుకే ఆయన పేరును ఎంపిక చేశారన్నారు. రామ్‌నాథ్‌కు మించిన దళిత నేతలు దేశంలో చాలామందే ఉన్నారన్నారు. సుష్మా స్వరాజ్ పేరునో, అద్వానీ పేరునో సూచించాల్సిందన్నారు. లేకపోతే ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ను రెండోసారి కొనసాగించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
అమిత్ షాకు జగన్ హామీ
ప్రధాని మోడీ తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా వైసిపి అధినేత జగన్‌కు ఫోన్ చేశారు. రామ్‌నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. మీకు మా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే దళిత నేతను ఎంపిక చేయడం పట్ల బిజెపికి అభినందనలు తెలిపారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications