రేప్ : ఆరేళ్ల బాలికపై అరవయ్యేళ్ల వృద్దుడి అఘాయిత్యం

మచిలీపట్నం : చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా దేశంలో స్త్రీలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆరేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడిన కాస్త ఆలస్యంగా మచిలీపట్నంలో వెలుగుచూసింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన గైనకాలజిస్ట్ బాలిక అత్యాచారానికి గురైనట్టు నిర్ధారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నం పరిధిలోని చింతగుంటపాలెంలో ఎప్పటిలాగే అంగన్ వాడీ స్కూల్ కి వెళ్లిన బాధిత బాలిక సాయంత్రం సమయంలో మిగతా పిల్లలతో కలిసి ఇంటికి వస్తున్న సమయంలో, మాయ మాటలు చెప్పిన నాగేశ్వరరావు అనే 60 ఏళ్ల వృద్దుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. మార్చి 31వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు నాగేశ్వరరావు స్థానిక కార్పోరేటివ్ సొసైటీలో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. మాయ మాటలతో అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని, బాలిక ఇంటికి చేరుకోకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు.. బాలిక కోసం వెతుకుతుండగా, నిందితుడు నాగేశ్వరరావు ఇంటి వెనుకాల బాలిక ఏడుస్తూ కనిపించిందని చెప్పారు.

Man, 60, rapes 6-year-old girl in Machilipatnam

బాలికకు తీవ్ర రక్త స్రావం కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడి వైద్యులు మచిలీపట్నం ప్రభుత్వ గైనకాలజిస్టు దగ్గరికి వెళ్లాలని సూచించడంతో తిరిగి ప్రభుత్వాసుపత్రికి వెళ్లారని తెలిపారు. కాగా, అక్కడ బాలికను పరీక్షించిన గైనకాలజిస్ట్ ప్రియదర్శిని.. బాధిత బాలిక జ్వరం, మూత్ర సంబంధిత సమస్య, రక్త స్రావంతో బాధపడుతుండడాన్ని గుర్తించారు.

మెరుగైన వైద్య పరీక్షల కోసం బాలికను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. మూత్ర సంబంధిత సమస్యలతో బాలిక బాధపడడాన్ని గమనించిన అక్కడి వైద్యులు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించి బాలిక అత్యాచారానికి గరైనట్టుగా నిర్డారించారు. దీంతో చిల్డ్రన్ సెక్సువల్ వేధింపుల చట్టం సెక్షన్ 376 కింద నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+