హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోపీ పెట్టిన మోసగాడు, అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Man arrested for cheating MLAs and MPS
హైదరాబాద్: పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుకు టోకరా వేసి వసూళ్లకు పాల్పడ్డ ఘరానా మోసగాడిని గురువారం హైదరాబాద్ నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేటుగాడి పేరు బాలాజీ నాయుడు (34). నాయుడు, మనోహర్ అనే ఇతర పేర్ల ద్వారా నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరిట మోసం చేసి పోలీసులకు దొరికిపోయాడు.

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగిలిప్పిస్తానని చాలా మంది నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ మాయగాడి బారినపడి మోసపోయిన వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ నాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను సేకరించేవాడు.

ఆ తర్వాత వారికి ఫోన్లు చేసి రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకుని వారి నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని అందుకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు పంపించండని మాయమాటలు చెప్పేవాడు. ఆ తర్వాత తన అకౌంట్ నెంబర్లలో డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పేవాడు. అకౌంట్‌లో వారు డబ్బులు డిపాజిట్ చేయగానే వాటిని డ్రా చేసుకుని అక్కడి నుంచి జారుకునేవాడు.

ఈ రకంగా మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీల నుంచి దాదాపు 6.31 లక్షల సొత్తును లాగాడు. ఈ కేటుగాడి మాయలో పడి మోసపోయిన ఎంపీల్లో హనుమంతరావు (1.09 లక్షలు), దేవేందర్‌గౌడ్ (41 వేలు), బి.మాధవరావు (66 వేలు), పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (34 వేలు), ఆకుల శేఖర్ (1.32 లక్షలు) వసూలు చేశాడు. నేరస్థుడి నుంచి పోలీసులు 50 శాతం సొమ్ము రికవరీ చేయడంతోపాటు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

English summary

 A person has been arrested by Hyderabad CCS police for cheating people. Even MPs and MLAs have been cheated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X