వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాన్ రివర్స్, అఖిలప్రియకు షాకివ్వబోయి బుక్కైన అలీ: కొత్త ట్విస్ట్, విడుదల

తన సంతకం ఫోర్జరీ కావడంపై మంత్రి భూమా అఖిలప్రియ బుధవారం స్పందించారు. తన చాంబర్‌కు ఓ వ్యక్తి ఉద్యోగం కోసం వచ్చాడని, అతను తెచ్చిన లేఖలో తన సంతకం ఉండటంతో తనకు అనుమానం వచ్చిందని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: తన సంతకం ఫోర్జరీ కావడంపై మంత్రి భూమా అఖిలప్రియ బుధవారం స్పందించారు. తన చాంబర్‌కు ఓ వ్యక్తి ఉద్యోగం కోసం వచ్చాడని, అతను తెచ్చిన లేఖలో తన సంతకం ఉండటంతో తనకు అనుమానం వచ్చిందని చెప్పారు.

చదవండి: ఇంత ఆలస్యమా, ఆదినారాయణ క్షమాపణకు డెడ్‌లైన్: సూటిగా మంత్రితో చెప్పారు

ఆ లేఖ చూసి అవాక్కయ్యా

ఆ లేఖ చూసి అవాక్కయ్యా

అడ్డదార్లలో ఉద్యోగాలు సంపాదించాలనుకునే వాళ్లకు తాను ఎప్పుడు రికమెండ్ చేయనని, తాను మంత్రిని అయ్యాక ఎక్కడా అలాంటి సంతకాలు చేయలేదని అఖిలప్రియ చెప్పారు. తాజాగా ఈ లేఖలో తన సంతకం చూసి షాక్ అయ్యానని చెప్పారు.

అతను నంద్యాల, ఆళ్లగడ్డకు కూడా వచ్చాడని

అతను నంద్యాల, ఆళ్లగడ్డకు కూడా వచ్చాడని

ఇదే వ్యక్తి గతంలో నంద్యాల, ఆళ్లగడ్డకు కూడా వచ్చాడని అఖిలప్రియ తెలిపారు. కానీ తాను సంతకం చేయలేదని తెలిపారు. ఫోర్జరీ సంతకంతో మోసం చేయాలని చూసిన ఆ వ్యక్తిపై ఎస్పీఎఫ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

నా చాంబర్‌కు వచ్చాడు

నా చాంబర్‌కు వచ్చాడు

ఉద్యోగం కోసం తాను సిఫార్సు చేశానని చెప్పి, గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీ అనే వ్యక్తి స‌చివాల‌యంలో అధికారుల‌ వద్దకు వెళ్లాడ‌ని, వారు నిరాక‌రించ‌డంతో, త‌న ఛాంబ‌ర్‌కు వ‌చ్చి సంత‌కం పెట్టమ‌ని కోరాడ‌ని అఖిలప్రియ తెలిపారు.

 నా సంతకంతో పాటు స్టాంప్

నా సంతకంతో పాటు స్టాంప్

సంత‌కం పెట్టే ముందు అత‌డి వద్ద ఉన్న అన్ని ప‌త్రాల‌ను చెక్ చేశాన‌ని, అయితే, తాను ఉద్యోగానికి సిఫార్సు చేసిన‌ట్లు అప్పటికే ఓ ప‌త్రంలో త‌న సంత‌కం ఉంద‌ని అఖిలప్రియ చెప్పారు. అంతేగాక‌, దానిపై తన మినిస్ట్రీ స్టాంపు కూడా ఉంద‌న్నారు.

ఇలాంటి వారి పట్ల జాగ్రత్త

ఇలాంటి వారి పట్ల జాగ్రత్త

దాంతో అది త‌న‌ సంత‌కం కాద‌ని తెలుసుకుని, అత‌డిని నిల‌దీశానని అఖిలప్రియ చెప్పారు. ఇంత‌కు ముందు ఆ వ్య‌క్తి నంద్యాలలో తిరుగుతూ కనిపించాడన్నారు. నిందితుడిని పోలీసుల‌కు అప్పగించామన్నారు. ఇటువంటి వ్య‌క్తులు చేసే ప‌నుల ప‌ట్ల జాగ్ర‌త్తగా ఉండాల‌ని అధికారుల‌ను హెచ్చరించారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

కాగా, ఏపీ స‌చివాల‌యంలో అలీ అనే వ్య‌క్తి ఫోర్జరీ సంతకంతో ఉద్యోగం పొందాలని చూసి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అలీ వారం రోజుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలంటూ అఖిలప్రియ ఫోర్జరీ సంతకంతో సచివాలయానికి వచ్చాడు. అప్పటికే పత్రాలపై అఖిల సంతకం ఉంది. ఆమె సంతకం మరోసారి అవసరమవడంతో ఆమె వద్దకు వెళ్లారు.

మీ ఆదేశాలు చెల్లడం లేదని అఖిలను ప్రశ్నించాడు

మీ ఆదేశాలు చెల్లడం లేదని అఖిలను ప్రశ్నించాడు

మీ ఆదేశాలు చెల్లడం లేదని నేరుగా అఖిలప్రియనే ప్రశ్నించాడు. అయితే, అప్పటికే తన సంతకం ఉండటం, దానిని చూసి అది ఫోర్జరీది కావడం గుర్తించిన అఖిలప్రియ... తనకు షాకివ్వాలనుకున్న అతనికి ఝలక్ ఇచ్చారు. దీంతో అతడి ప్లాన్ రివర్స్ అయింది. చివరకు అడ్డంగా దొరికిపోయాడు.

ఇదిలా ఉండగా పోలీసులు అలీని విడుదల చేశారు. అఖిలప్రియ పేషీ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు అందితే అలీని పిలిచి విచారిస్తామని పోలీసులు వెల్లడించారు.

English summary
A trickster attempted to cheat Andhra Pradesh Minister Bhuma Akhila Priya by forging her signature to get a job in AP Tourism department. The accused even went a step ahead by questioning the Minister at her chamber and alleged that the staff of the peshi were not heeding to the request.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X