మహిళతో రెండో పెళ్లి: కూతురు వరుస గర్ల్‌పై అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాదులో ఉంటున్నాడు. వెంకటగిరి ప్రాంతంలోని ఓ ప్రయివేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
అక్కడే కాకినాడ ప్రాంతానికి చెందిన మరో మహిళ నివసిస్తోంది. ఆమెకు గతంలోనే వివాహమై పదేళ్ల కూతురు ఉంది. భర్త చనిపోవడంతో సెక్యూరిటీ గార్డుగా పని చేసే యువకునితో పరిచయంతో ఎవరికి తెలియకుండా వారు పెళ్లి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో కొన్నాళ్ల తర్వాత ఆమె కుమార్తెతో అతను అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. భార్య ఇంట్లో లేని సమయంలో బాలికపై అత్యాచారం చేశాడు. అతను బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాలిక తాను చదువుతున్న పాఠశాలలో ఉపాధ్యాయురాలికి విషయం చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications