దారుణం: నోట్లో గుడ్డలు కుక్కి, బ్లేడుతో కోసి చిన్నారిపై శ్మశానంలో అత్యాచారం

అమరావతి: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో గ్రామం దర్గా దళితవాడలో జరిగింది. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం...

చిన్నారి తల్లిదండ్రులు కూలీ పనుల నిమిత్తం విజయవాడలో ఇటుక బట్టీల పనులకు వెళ్లారు. దీంతో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గండవరంలో ఉంటున్న తాత ఆ చిన్నారిని గ్రామానికి తీసుకొచ్చాడు. ఇదే సమయంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడకు చెందిన శీను (20), అతని స్నేహితుడు చెంచయ్య గండవరంలో ఉంటున్న తమ మేనత్త ఇంటికి వచ్చారు.

ఈ క్రమంలో చిన్నారిపై శీను కన్నేశాడు. గురువారం రాత్రి ఆ చిన్నారిని తిరునాళ్లకు తీసుకెళ్లి బొమ్మలు కొనిస్తానని చెప్పి, నాయనమ్మను నమ్మించి బాలికను తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో శ్మశానంలోకి తీసుకెళ్లి.. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి, విచక్షణారహితంగా బ్లేడ్‌తో గాయపరిచాడు.

Man arrested for raping minor girl in nellore, andhra pradesh

అనంతరం తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన చిన్నారిపై అత్యాచారం చేసి, అక్కడ నుంచి పరారయ్యాడు. రాత్రంతా స్మశానంలోనే ఉన్న బాలిక తెల్లవారుజామున ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. మధ్యలో ఏడుస్తూ ఇంటికి వెళ్తున్న చిన్నారిని మాజీ సర్పంచ్ డేవిడ్, మరో మహిళ చూసి ఏం జరిగిందని ఆ చిన్నారిని అడిగారు.

అనంతరం చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి మర్మాంగాలపై రక్తపు మరకలు, ముఖంపై గాయాలను శుభ్రపరిచి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని చిన్నారి నాయనమ్మ, స్థానికులను విచారించారు.

ప్రస్తుతం పోలీసులకు పరారీలో ఉన్న శీను ఆచూకీ తెలుసుకునేందుకు అతడి స్నేహితుడు చెంచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి తాత ఫిర్యాదు మేరకు శీనుపై నిర్భయ కేసు నమోదు చేశారు.

మద్యానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్యాయత్నం

మద్యానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. మద్యం తాగేందుకు భార్య డబ్బు ఇవ్వలేదని అతను మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడి పరిస్థితి విషమించడంతో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+