డ్రంకన్ డ్రైవ్: అక్కాచెల్లెళ్లతో కలిసి ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి

విశాఖపట్నం: డ్రంకన్ డ్రైవ్‌లో భాగంగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించి, ఆ తర్వాత తన అక్కాచెల్లెళ్లు, బంధువులతో కలిసి ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై మూకుమ్మడి దాడి పోలీస్ ఔట్ పోస్టుపై విరుచుకుపడిన సంఘటన సోమవారం రాత్రి విశాఖపట్నం తగరపువలసలో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తగరపువలసలో డ్రంకన్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తగరపు వలసకు చెందిన వ్యాపారి రవి వాహనాన్ని నిలిపివేసిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసేందుకు సిద్ధమయ్యాడు.

Man attacked traffic police in visakhapatnam

బ్రీత్ ఎనలైజర్ పరీక్ష రవి నిరాకరించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు పరీక్ష చేయబోయిన పోలీస్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన అతని బంధువులు పోలీసులకు చెందిన రక్షక్ వహనాన్ని ధ్వంసం చేశారు.

యువకుడి అక్కాచెల్లెళ్లు బాధిత కానిస్టేబుల్‌పై విరుచుకుపడటంతో పాటు, అతనిపై తీవ్రంగా దాడి కూడా చేశారు. కారులో కూర్చున్న కానిస్టేబుల్‌ను బయటకు ఈడ్చి మరీ కొట్టారు. ఆ తర్వాత బానెట్ పైకి ఎక్కిన రవి సోదరి వీరంగం సృష్టించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడితో పాటు అతడి అక్కాచెల్లెళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+