ప్రేయసిపై ప్రియుడి దాడి: భార్యాపిల్లలపై వ్యక్తి దాడి

 Man attacks on his lover in Nellore district
నెల్లూరు/ గుంటూరు: నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలం అయ్యవారిపల్లెలో దారుణ సంఘటన చోటు చేసుకుంది గురువారం ఉదయం ప్రియురాలిపై ఓ ప్రియుడు దాడి చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం పార్కు రోడ్డులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలపై, బార్యపై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణానకి చెందిన నావూరి కాస్పర్ బుధవారం రాత్రి తాగిన మత్తులో ఆ దాడికి ఒడిగట్టాడు.

రాత్రి భోజనం చేస్తున్న సమయంలో తనకు కోడిగుడ్డు వండలేదని భార్యతో గొడవ పడుతుండగా కుమారుడు అడ్డు వచ్చాడు. ఆ కోపంతో తాగిన మైకంలో అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న భార్యాపిల్లలపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.

భార్య అన్నమ్మ, కుమారుడు సునీల్, కూతురు నీలిమ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు వీరిని స్థానికులు చిన్న కాకాని ఎన్నారై జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+