ప్రేమ పేరుతో!, శారీరకంగా దగ్గరై..: ఆమెతో ఇంట్లో ఉండగా నిర్బంధించి పట్టించారు..
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి.. పెళ్లి మాటెత్తేసరికి తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని ఇంట్లో నిర్బంధించి మరీ పోలీసులకు పట్టించారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతంలో చోటు చేసుకుంది.
విజయనగరం: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి.. పెళ్లి మాటెత్తేసరికి తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని ఇంట్లో నిర్బంధించి మరీ పోలీసులకు పట్టించారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం ఎంఆర్ కాలేజీలో దాసరి రాధ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే క్రమంలో జామి మండలం భీమసింగి గ్రామానికి చెందిన బోడసింగి కోటేశ్వరరావుతో ఆమెకు పరిచయం ఏర్పడింది.

పెళ్లి చేసుకుంటానని కోటేశ్వరరావు రాధను నమ్మించడంతో.. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. అయితే ఇటీవలి కాలంలో ఎప్పుడు పెళ్లి మాటెత్తినా కోటేశ్వరరావు దాన్ని దాటవేస్తూ వస్తున్నాడు. రాధ తన అక్కా బావలకు కూడా విషయం చెప్పడంతో.. వాళ్లు కూడా గట్టిగా నిలదీశారు. అయినప్పటికీ కోటేశ్వరరావు నుంచి సమాధానం రాలేదు.
తమ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని దాటవేసేవాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి తామరాపల్లిలోని రాధ ఇంటికి కోటేశ్వరరావు వచ్చాడు. మరోసారి పెళ్లి విషయంపై నిలదీయగా.. మళ్లీ అదే దాటవేత ధోరణి కనబర్చాడు. దీంతో ఇక లాభం లేదనుకున్న రాధ అక్కా-బావ అతను ఇంట్లో ఉన్న సమయంలో నిర్బంధించారు. ఆ సమయంలో రాధ కూడా అతనితో పాటే ఇంట్లో ఉంది.
ఆపై పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు రాధ-కోటేశ్వరరావులను కొండతామరాపల్లికి తీసుకెళ్లారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాధకు న్యాయం చేయాలని ఆమె అక్కా-బావ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications