నిరుద్యోగులకు టోకరా: ఒక్కోక్కరి నుంచి 25 వేలు వసూలు (ఫోటోలు)
అమరావతి: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పరీక్ష ప్రశ్నాపత్రాలు ముందుగా ఇస్తామని, సులువుగా ఉద్యోగాలు వస్తాయని అభ్యర్ధులను మభ్యపెట్టిన ముఠాను విశాఖ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల డీసీపీ త్రివిక్రమవర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నగరానికి చెందిన ఎం. శేషగిరిరావు, గోపాలపట్నానికి చెందిన కోటా సునీల్ కుమార్ (24), విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన పిన్నింటి రమణ (29), పిరిడి శంకరరావు (31) అలియాస్ రవి, నెల్లిమర్ల మండలానికి చెందిన శ్రీహరి (31), శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన అప్పిని కాంతారావు (24), లావేరు మండలానికి చెందిన జగ్గురోతు కరుణాకరరావు (21) ఒక ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరానికి పాల్పడ్డారన్నారు.

నిరుద్యోగులకు టోకరా: ఒక్కోక్కరి నుంచి 25 వేలు వసూలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పరీక్ష ప్రశ్నాపత్రాలు ముందుగా ఇస్తామని, సులువుగా ఉద్యోగాలు వస్తాయని అభ్యర్ధులను మభ్యపెట్టిన ముఠాను విశాఖ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

నిరుద్యోగులకు టోకరా: ఒక్కోక్కరి నుంచి 25 వేలు వసూలు
విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల అభ్యర్ధులను ముఠా సభ్యులు ఒక్కొక్కరు పది మంది చొప్పున మొత్తం 76 మందిని బుట్టలో వేసుకున్నారు. వీరందరినీ మర్రిపాలెంలో ఉన్న ఓ భవనంలో కిక్కిరిసిన గదిలో ఉంచారు. ఈ నెల 3న అర్ధరాత్రి పరీక్ష ప్రశ్నాపత్రాలను ఇస్తామని నమ్మించి వారి వద్ద నుంచి ఒరిజనల్ ధ్రువపత్రాలను తీసుకున్నారు.
నిరుద్యోగులకు టోకరా: ఒక్కోక్కరి నుంచి 25 వేలు వసూలు
దీంతో అనుమానం వచ్చిన ఒక అభ్యర్ధి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అసలు నిజం బయట పడింది. నిందితుల్లో మూగిడి రామానాయుడు (27) బక్కన్నపాలెం 16వ ఏపీఎస్‌పీ బెటాలియన్ కానిస్టేబుల్.

నిరుద్యోగులకు టోకరా: ఒక్కోక్కరి నుంచి 25 వేలు వసూలు
అభ్యర్ధుల నుంచి ఒరిజినల్ ధ్రువపత్రాలను, రూ. 25వేల నగదుని స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు ఎం.శేషగిరిరావు అలియాస్ గిరి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications